Election Commission Comment : 75 ఏళ్ల‌కు మేల్కొన్న ఈసీ

ఉచిత హామీల‌పై పార్టీల‌కు బిగ్ షాక్

Election Commission Comment : ఎట్ట‌కేల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం మేల్కొంది. అది 75 ఏళ్ల‌యింది దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి. ఏ దేశంలోనైనా ప్ర‌భుత్వానికి మూల స్తంభం ఎన్నిక‌ల సంఘం. స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ ఇది. దీనికి రాజ్యాంగ ప‌రంగా అత్యుత్త‌మ‌మైన అధికారాలు ఉంటాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ని చేసిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌లో చండ శాస‌నుడిగా పేరు తెచ్చుకున్నారు త‌మిళ‌నాడుకు చెందిన టి.ఎన్. శేష‌న్. ఆయ‌న ఆ ప‌ద‌విలో ఉన్నంత వ‌ర‌కు దేశంలో హ‌ల్ చ‌ల్ చేశారు.

ఆపై ఎవ‌రైనా పోటీ చేయాలంటే జ‌డుసుకునేలా చేశారు. అక్ర‌మాలు, కేసులు ఏవైనా ఉంటే వారిని తొల‌గించారు. అన‌ర్హులుగా ప్ర‌క‌టించారు. కీల‌క‌మైన మార్పులు, సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు ఎన్నిక‌ల సంఘంలో(Election Commission) . ఆయ‌న త‌ర్వాత ఎలాంటి ప్ర‌భావం చూప‌లేక పోయారు.

రాను రాను ఎన్నిక‌ల సంఘం కూడా అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాల‌కు వ‌త్తాసు ప‌లుకుతాయ‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. ఇన్నేళ్ల త‌ర్వాత

కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేసింది ఈసీ. ప్ర‌ధానంగా ఈ దేశంలో కొలువు తీరిన పార్టీలు, నాయ‌కులపై స‌వాల‌క్ష అవినీతి, అక్ర‌మాలు, నేరాల కేసులు న‌మోదై ఉన్నాయి.

అంతే కాదు పొలిటిక‌ల్ పార్టీల‌కు అంద‌జేస్తున్న విరాళాలకు లెక్కా ప‌త్రం లేకుండా పోయింది. ఇక ప్ర‌స్తుతం దేశంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా

పార్టీకి వంద‌ల కోట్లు శ‌ర‌ప‌రంగా వ‌స్తున్నాయి. దీనికి లెక్కలంటూ ఉండ‌వు. ఇక కేవ‌లం ఎనిమిదేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీకి భారీ ఎత్తున నిధులు ఎలా వ‌చ్చాయో తెలియ‌దు.

ఇది ప‌క్క‌న పెడితే ఎన్నిక‌ల ప్ర‌చారంలో, ఇత‌ర‌త్రా స‌మ‌యాల్లో పెద్ద ఎత్తున పార్టీలు, నాయ‌కులు , ప్ర‌జా ప్ర‌తినిధులు లెక్కించ లేనంత‌గా హామీల‌ను గుప్పిస్తూ వ‌స్తున్నారు.

వాటిని నెర‌వేర్చాలంటే ఏకంగా దేశాన్ని అమ్మాల్సిందే. అంత‌లా ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇస్తూ ఓట‌ర్ల‌కు గాలం వేసే ప‌నిలో ప‌డ్డారు. గ‌త కొంత

కాలం నుంచీ పౌర స‌మాజంతో పాటు భావ సారుప్య‌త క‌లిగిన మేధావులు, క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, బుద్ది జీవుల‌తో పాటు నిబ‌ద్ధ‌త క‌లిగిన రాజ‌కీయ నాయ‌కులు కూడా పూర్తి పార‌దర్శ‌కంగా ఉండాల‌ని కోరుతూ వ‌స్తున్నారు.

దీనిని ప్ర‌ధాన డిమాండ్ గా పేర్కొంటున్నా ఈరోజు వ‌ర‌కు ఈసీ చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించింది. కేవ‌లం ఎన్నిక‌లు నిర్వ‌హించేంత వ‌ర‌కు మాత్ర‌మే

నిలిచి పోయింది. కానీ ఈసీకి ఎన్నిక‌ల స‌మ‌యంలో విశిష్ట అధికారాలు ఉంటాయ‌న్న సంగ‌తి ఏనాడో మ‌రిచి పోయింద‌న్న విమ‌ర్శ‌లున్నాయి.

తాజాగా ఎన్నిక‌ల సంఘంలో చిన్న క‌ద‌లిక వ‌చ్చింది. అదేమిటంటే ఎడా పెడా హామీలు గుప్పిస్తూ ప్ర‌జ‌ల‌ను నిట్ట నిలువునా మోసం

చేస్తున్నార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఆపై జ‌నాన్ని ఓటు బ్యాంకుగా మార్చ‌డం కూడా కుట్ర‌లో భాగమేన‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

దేశంలో కొలువు తీరిన పార్టీలు ఇచ్చిన హామీలు నెర‌వేర్చాలంటే వందేళ్ల స‌మ‌యం ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా. తాజాగా

కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

మేని ఫెస్టోలను రూపొందించ‌డం రాజ‌కీయ పార్టీల హ‌క్కు అనేది సూత్ర‌ప్రాయంగా అంగీక‌రిస్తున్నా స్వేచ్ఛాయుత మైన , నిష్ప‌క్ష‌పాతంగా

జ‌రిపేందుకు సిద్ద‌మై ఉన్నా ఆచ‌ర‌ణ‌లో ఆశించిన ప్ర‌యోజ‌నం జ‌ర‌గ‌డం లేదు. ఈ సంద‌ర్భంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ఆయా పార్టీలు ఎన్నిక‌ల సంద‌ర్భంగా హామీలు ఇవ్వ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది ఈసీ. అంతే కాదు ఎలా నిధులు స‌మ‌కూరుస్తారో స్ప‌ష్టం చేయాల‌ని కుండ

బ‌ద్ద‌లు కొట్టింది. ఇది పూర్తిగా రాజ్యాంగ బ‌ద్ద‌మైన నేరంగా పేర్కొంది. ఒక ర‌కంగా ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మేన‌ని హెచ్చ‌రించింది.

ఉచితాల పేరుతో హామీలు ఇవ్వ‌డం భాగ‌మే అయినా అది హ‌క్కు కాద‌ని ఒక‌వేళ అలా చేస్తే దానికి లెక్కా ప‌త్రం ఉండాల‌ని పేర్కొంది. ఇది మంచి

ప‌రిణామం. ఏ పార్టీల‌తై ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇస్తాయో వాటిని శాశ్వ‌తంగా పోటీ చేయకుండా నిషేధం విధిస్తే కొంత‌లో కొంత మేర‌కైనా మార్పు వ‌స్తుంది.

Also Read : 5జీ సేవ‌లు వైజాగ్ లో ఏర్పాటు చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!