Team India Flies : ఆస్ట్రేలియాకు బయలు దేరిన టీమిండియా
అక్టోబర్ 16 నుంచి టి20 వరల్డ్ కప్ షురూ
Team India Flies : భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరి(Team India Flies) వెళ్లింది. అక్టోబర్ 16 నుంచి టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నెల రోజులకు పైగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా టోర్నీ జరగనుంది. గురువారం తెల్ల వారుజామున ప్రత్యేక ఫ్లైట్ లో టీమిండియా బయలు దేరింది.
14 మంది సభ్యులతో కూడిన టీమ్ ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ. ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి విమర్శలు ఎదుర్కొంది. ప్రధానంగా కేరళ స్టార్ హిట్టర్ గా పేరొందిన సంజూ శాంసన్ ను ఎంపిక చేయక పోవడంపై మాజీ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా స్టార్ పేసర్ గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరు క్రికెట్ అకాడెమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇదిలా ఉండగా బుమ్రా లేక పోవడం భారత జట్టుకు బిగ్ షాక్ అని చెప్పక తప్పదు. కాగా ఆస్ట్రేలియాకు బయలు దేరిన భారత జట్టు సభ్యులతో కూడిన ఫోటోను షేర్ చేసింది.
మరో వైపు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సహచర ఆటగాళ్లు హర్షల్ పటేల్ , యుజ్వేంద్ర చాహల్ తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. ప్రస్తుతం భారత క్రికెటర్ల తాజా ఫోటోలు సోషల్ మీడియాను హల్ చల్ చేస్తున్నాయి. సూర్య కుమార్ యాదవ్ , వికెట్ కీపర్లు పంత్, దినేష్ కార్తీక్ లు కూడా ఫోటోలు షేర్ చేశారు.
Also Read : టి20 వరల్డ్ కప్ టైటిల్ భారత్ దే