Sanju Samson : శాంసన్ ఆటతీరు సింప్లీ సూపర్
మాజీ ఆటగాళ్లు ప్రశంసల జల్లు
Sanju Samson : లక్నో వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగినా చివరకు 9 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయాన్ని నమోదు చేసింది. ప్రధానంగా కేరళ స్టార్ సంజూ శాంసన్(Sanju Samson) సెన్సేషన్ ఇన్నింగ్స్ ఆడాడు.
భారత జట్టు ఓటమి పాలైనా చివరి దాకా పోరాడిన తీరు ప్రశంసలు అందుకుంది. 86 పరుగులతో నాటౌట్ గా నిలిచి పరువు పోకుండా కాపాడిన శాంసన్ పై మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్ తో పాటు పలువురు కితాబు ఇచ్చారు. ప్రత్యర్థి జట్టు 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేస్తే 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి బంతి దాకా పోరాడింది.
శాంన్ 86 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. స్టార్ క్రికెటర్ శాంసన్ ను(Sanju Samson) ఆసియా కప్ , టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేయలేదు. తన వన్డే కెరీర్ లో అత్యుత్తమ స్కోర్ సాధించాడు. బరిలోకి దిగిన టీమిండియా 5.1 ఓవర్లలో కేవలం 8 పరుగులకే శిఖర్ ధావన్ , శుభ్ మన్ గిల్ వికెట్లను కోల్పోయింది.
ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్కడా తడబడకుండా అడ్డు గోడలా నిలిచాడు. చివరి బంతి దాకా తనదైన శైలిలో బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 86 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 50 రన్స్ చేస్తే శార్దూల్ ఠాకూర్ 31 రన్స్ తో ఆకట్టుకున్నాడు.
ఈ ఇద్దరితో కీలకమైన ఇన్నింగ్స్ నెలకొల్పారు. వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు బ్యాటర్లు .
ఇకనైనా భారత సెలెక్టర్లు సంజూ శాంసన్ పట్ల కరుణ చూపించాలని కోరుతున్నారు.
Also Read : సంజూ శాంసన్ సెన్సేషన్ ఇన్నింగ్స్