Kamal Hasan : చోళుల కాలంలో హిందూ మతం లేదు
నటుడు కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్
Kamal Hasan : ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన కామెంట్స్ చేశారు. చోళుల పరిపాలన కాలంలో హిందూ మతం అన్నది లేనే లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తమిళ దర్శకుడు వెట్రిమారన్ కు కమల్ హాసన్ పూర్తి మద్దతు తెలిపారు.
ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ మాత్రం దర్శకుడు వెట్రి మారన్, నటుడు కమల్ హాసన్(Kamal Hasan) పై నిప్పులు చెరిగింది. రాజ రాజ చోళుడు హిందూ రాజు కానే కాదంటూ జాతీయ అవార్డు గ్రహీత, తమిళ దర్శకుడు వెట్రిమారన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఇదే క్రమంలో కమల్ హాసన్ బీజేపీపై మండిపడ్డారు. రాజ రాజ చోళ హిందువు కాదు. కానీ బీజేపీ తమ గుర్తింపును దొంగించేందుకు ప్రయత్నిస్తున్నారని , ఇప్పటికీ తిరువల్లువర్ కు కాషాయం చేసేందుకు ప్రయత్నించారని, తాము ఎప్పటికీ అనుమతించ బోమంటూ హెచ్చరించారు వెట్రిమారన్.
ఆనాటి చోళుల కాలంలో హిందూ మతం అన్నది లేదు. వైష్ణవం, శివం, సమానం ఉన్నాయి. ఎవరూ హిందూ అనే పదాన్ని ఉపయోగించ లేదు. బ్రిటీష్ వారు మాత్రమే హిందూ అనే పదాన్ని ఉపయోగించారని అన్నారు కమల్ హాసన్. తుత్తుకుడిని టుటికోరిన్ గా ఎలా మార్చారో దేశానికి తెలుసంటూ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా రాజ రాజ చోళ స్పూర్తితో కల్పిత నవల ఆధారంగా రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ -1 మూవీ విడుదలై భారీ జనాదరణను చూరగొంటోంది. చిత్రం రిలీజ్ అనంతరం దర్శకుడు వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Also Read : మహ్సా అమినీ మరణం బాధాకరం – ప్రియాంక