INDW vs PAKW T20 Asia Cup : పాకిస్తాన్ చేతిలో భార‌త్ ఓట‌మి

పాక్ అమ్మాయ‌లు పారా హుషార్

INDW vs PAKW T20 Asia Cup : మ‌హిళ‌ల ఆసియా క‌ప్ -2022 మెగా టోర్నీలో వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న మ‌హిళా భార‌త క్రికెట్ జ‌ట్టుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. దాయాది పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టుతో(INDW vs PAKW T20 Asia Cup) జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో 13 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. త‌క్కువ స్కోర్ కే ల‌క్ష్యం ఉన్న‌ప్ప‌టికీ భార‌త మ‌హిళా క్రికెట‌ర్లు ధాటిగా ఆడ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు.

ఒక ర‌కంగా పాకిస్తాన్ బౌల‌ర్లు క‌ట్ట‌డి చేశారు. భార‌త బ్యాటింగ్ ఆర్డ‌ర్ కుప్ప కూలింది. రిచా ఘోష్ 13 బంతుల్లో 26 ప‌రుగులు చేసింది. మిగ‌తా ప్లేయ‌ర్లు ఎవ‌రూ పోటీ ఇవ్వ‌లేక పోయారు. ఇదే టోర్నీలో థాయ్ లాండ్ జ‌ట్టు చేతిలో ఓట‌మి పాలైన పాకిస్తాన్ భార‌త్ జ‌ట్టుతో పుంజుకుంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 137 ప‌రుగులు చేసింది.

ధార్ , కెప్టెన్ బిస్మా మ‌రూఫ్ క‌లిసి 76 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయిన త‌మ జ‌ట్టును వీరిద్ద‌రూ ఒడ్డుకు చేర్చారు. అనంత‌రం 138 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా(Team India) 124 ప‌రుగుల‌కే కుప్ప కూలింది. స‌బ్బినేని మేఘ‌న 15, స్మృతి మంధాన 17, ద‌యాల‌న్ హేమ‌ల‌త 20, దీప్తి శ‌ర్మ 16 ప‌రుగులు చేశారు.

రిచా ఘోష్ 20 ప‌రుగులు చేసి టాప్ లో నిలిచింది. భార‌త బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ 27 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టింది. మొత్తంగా పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టు అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది. భార‌త్ ను ఆలౌట్ చేసి 13 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. భార‌త మ‌హిళా జ‌ట్టు మూడు మ్యాచ్ ల‌లో గెలుపొందింది.

Also Read : ఆటగాళ్లను ఎంపిక చేయ‌డం క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!