CNG PNG Prices Hiked : సీఎన్జీ..పీఎన్జీ గ్యాస్ ధ‌ర‌లు పెంపు

కొండెక్కిన స‌హ‌జ వాయువు ధ‌ర‌లు

CNG PNG Prices Hiked : పండుగ‌ల సీజ‌న్ ప్రారంభం కావ‌డంతో స‌హ‌జ వాయుల ధ‌ర‌లు కొండెక్కాయి. సీఎన్జీ, పీఎన్జీ ధ‌ర‌ల‌ను పెంచాయి చ‌మురు సంస్థ‌లు. గ‌త వారం కేంద్ర ప్ర‌భుత్వం ఇన్ ఉట్ స‌హ‌జ వాయువు ధ‌ర‌ల‌ను రికార్డు స్థాయికి పెంచింది. కొద్ది రోజుల త‌ర్వాత ధ‌ర‌ల పెంపు జ‌రిగింది.

ఇదిలా ఉండ‌గా పెంచిన ధ‌ర‌లు అక్టోబ‌ర్ 8 శ‌నివారం ఉద‌యం నుంచే అమ‌లులోకి రానున్నాయి. సీఎన్జీ , పైప్డ్ వంట గ్యాస్ ను రిటైల్ చేసే ఇంద్ర‌ప్ర‌స్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) , ఢిల్లీ – ఎన్సీఆర్ , ఇత‌ర ప్ర‌దేశాల‌లో దాని గ్యాస్ ధ‌ర‌ల‌ను(CNG PNG Prices Hiked) స‌వ‌రించింది.

దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో డొమెస్టిక్ పైప్డ్ నేచుర‌ల్ గ్యాస్ (పీఎన్జీ) ధ‌ర ఎస్సీఎంకి రూ. 53.59కి చేర్చింది. ఘ‌జియాబాద్, నోయిడా, గ్రేట‌ర్ నోయిడా వంటి ఎన్సీఆర్ ప్రాంతాల‌కు , పీఎన్జీ ధ‌ర ఎస్సీఎంకి రూ. 53.46కి పెరిగింది.

కాగా గురుగ్రామ్ లో ఎస్సీఎంకి రూ. 51.79 అవుతుంది. పీఎన్జీ ధ‌ర‌లు ప్రామాణిక క్యూబిక్ మీట‌ర్ లేదా ఎస్సీఎంకి లెక్కించ‌బ‌డ‌తాయి. ఐజీఎల్ తాజాగా సీఎన్జీ ధ‌ర‌లు స‌వ‌రించ‌బ‌డ్డాయి. ఈ విష‌యాన్ని ఇంద్ర‌ప్ర‌స్థ గ్యాస్ లిమిటెడ్ వెల్ల‌డించింది.

ఢిల్లీలో ఎస్సీఎంకి రూ. 53.59 ఉండ‌గా నోయిడా, గ్రేట‌ర్ నోయిడా, ఘ‌జియాబాద్ లో రూ. 53.46 , క‌ర్నాల్ , రేవారీలో ఎస్సీఎంకి రూ. 52.40 గా ఉంది.

గురుగ్రామ్ లో ప్ర‌తి ఎస్సీఎంకి రూ. 51.79, ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ , మీర‌ట్ , షామ్లీలో ఒక్కో ఎస్సీఎంకి రూ. 56.97, ఆజ్మీర్ , పాలి, రాజ్ స‌మంద్ లో ఒక్కో ఎస్సీఎంకి రూ. 59.23 , కాన్పూర్ , హ‌మీర్పూర్, ఫ‌తేపూర్ లో రూ. 56.10 గా ఉంది.

ఇదిలా ఉండ‌గా దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో గ‌త నాలుగు రోజుల కింద‌టే సీఎన్జీ, పీఎన్జీ ధ‌ర‌లు పెరిగాయి.

Also Read : ఎక్క‌డి నుంచైనా భార‌త్ ఆయిల్ కొనుగోలు

Leave A Reply

Your Email Id will not be published!