INDW vs BANW Asia Cup 2022 : భారత్ భళా బంగ్లా విలవిల
ఆసియా కప్ లో భారత్ విక్టరీ
INDW vs BANW Asia Cup 2022 : మహిళల ఆసియా కప్ -2022లో భారత జట్టు దాయాది చేతిలో ఓటమి పాలైనా బంగ్లాదేశ్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటింది. షఫాలీ వర్మ, స్మృతి మంధాన అద్భుతంగా రాణించారు. బౌలర్లు కూడా కట్టడి చేయడంతో భారత మహిళా జట్టు ఏకంగా 59 పరుగుల తేడాతో బంగ్లాపై అద్భుత విజయాన్ని(INDW vs BANW Asia Cup 2022) నమోదు చేశారు.
శనివారం జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో టీమిండియా అన్ని విభాగాలలో రాణించింది. షఫాలీ వర్మ 55 పరుగులు చేయడమే కాకుండా రెండు వికెట్లు తీసింది. మరో వైపు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 47 పరుగులతో రాణించింది. దీంతో భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.
జెమోమీ రోడ్రిగ్స్ 24 బంతులు ఆడి 35 పరుగులతో హోరెత్తించింది. చివరి దాకా నాటౌట్ గానిలిచింది. అనంతరం 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మహిళల జట్టు 7 వికెట్లు కోల్పోయింది. 100 పరుగులకే పరిమితం అయ్యింది. ఇక బంగ్లాదేశ్ జట్టులో ఆ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా 36 పరుగులు చేసింది.
ఆమె ఒక్కరే అత్యధిక వ్యక్తిగత స్కోరర్ గా నిలవడం విశేషం. ఇక భారత జట్టు తరపున దీప్తి శర్మ , షఫాలీ వర్మ చెరో రెండు వికెట్లు కూల్చారు. ఇక స్నేహా రాణా, రేణుకా సింగ్ చెరో ఒక వికెట్ చొప్పున పడగొట్టారు.
ఇదిలా ఉండగా ఒక్క పాకిస్తాన్ తో ఓటమి పొందినా నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించడంతో భారత జట్టు సెమీ ఫైనల్ కు చేరింది.
Also Read : రమీజ్ రజా కామెంట్స్ భట్ సీరియస్