MK Stalin : డీఎంకే పార్టీ అధ్య‌క్షుడిగా ఎంకే స్టాలిన్

రెండోసారి ఏక‌గ్రీవంగా ఎన్నికైన సీఎం

MK Stalin :  త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ రెండోసారి డీఎంకే పార్టీ చీఫ్ గా ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం ఇది రెండోసారి. కొత్త‌గా ఏర్పాటు చేసిన జ‌న‌ర‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో పార్టీ అత్యున్న‌త ప‌ద‌వికి సంబంధించి ఆయ‌న ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఆదివారం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. సుదీర్ఘ‌మైన రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన పార్టీగా డీఎంకేకు పేరుంది. రాష్ట్రంలో ఎక్కువ ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుల‌లో స్టాలిన్ ఒక‌రు. అంతా ఆయ‌న‌ను ఎంకేఎస్ అని పిలుచుకుంటారు. మార్చి 1, 1953లో పుట్టారు. ఆయ‌న వ‌య‌స్సు 69 ఏళ్లు.

స‌తీమ‌ణి దుర్గా. త‌న‌యుడు ఉద‌య‌నిధి స్టాలిన్. 1996 నుండి 2002 దాకా చెన్నైకి 37వ మేయ‌ర్ గా ప‌ని చేశారు. 2009 నుండి 2011 వ‌ర‌కు త‌మిళ‌నాడు రాష్ట్రానికి ఉప ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకేను విజ‌య ప‌థాన న‌డిపించి సీఎంగా కొలువుతీరారు.

డీఎంకే పార్టీ త‌ర‌పున తండ్రి క‌రుణానిధి త‌ర్వాత సీఎం ప‌ద‌వి అధీష్టించిన రెండో వ్య‌క్తిగా ఎంకే స్టాలిన్(MK Stalin) నిలిచారు. స్టాలిన్ మ‌ద్రాస్ యూనివ‌ర్శిటీలో డిగ్రీ చ‌దివారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 2006 లో గ్రామీణాభివృద్ది శాఖ‌, స్థానిక ప‌రిపాల‌న మంత్రిగా ప‌ని చేశారు.

2013 జ‌న‌వ‌రి 3న ముత్తువేల్ క‌రుణానిధి స్టాలిన్ ను త‌న వార‌సుడిగా ప్ర‌క‌టించారు. 2017 జ‌న‌వ‌రి 4న స్టాలిన్ పార్టీ చీఫ్ గా ఎన్నిక‌య్యారు. 2021లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే అభ్య‌ర్థిగా స్టాలిన్ కొళ‌త్తూర్ అసెంబ్లీ నియోక‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. మే 7, 2021న త‌మిళ‌నాడు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

Also Read : గుజ‌రాత్ లో పీఎం న‌రేంద్ర మోదీ బిజీ

Leave A Reply

Your Email Id will not be published!