Deepika Padukone : డిప్రెషన్ అన్నది కనిపించని రోగం – దీపికా
తన తల్లి గుర్తించక పోతే ఉండేదానిని కాను
Deepika Padukone : ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే(Deepika Padukone) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మానసిక ఆరోగ్యం (డిప్రెషన్ ) అనేది కనిపించని రోగమని దానిని త్వరగా గుర్తించక పోతే అది ముదిరి మనుషుల్ని కాటేస్తుందని హెచ్చరించారు.
తాను ఈ స్థాయిలో ఉన్నానంటే తన తల్లే కారణమని పేర్కొంది. ఒకానొక సమయంలో తాను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయానని చెప్పారు దీపికా పదుకొనే. నన్ను నేను డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపారు.
ప్రస్తుతం ఈ బాలీవుడ్ నటి తమిళనాడు లోని తిరువళ్లూరులో ఉంది. ఇదిలా ఉండగా అక్టోబర్ 10 సోమవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించనున్నారు. లైవ్ లవ్ లాఫ్ గ్రామీణ కమ్యూనిటీ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని విస్తరిస్తోంది.
ఈ సందర్భంగా మానసిక ఆరోగ్యాన్ని ఎదుర్కోవడంలో సంరక్షకుల పాత్ర ఎలా ఉండాలనే దాని గురించి వివరించే ప్రయత్నం చేశారు దీపికా పదుకొనే. ఈ జర్నీలో కుటుంబీకుల సహకారం చాలా అవసరమని స్పష్టం చేశారు. నేను డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు అమ్మ చాలా కృషి చేసింది.
నేను ఎక్కడికి వెళ్లినా యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటుందని తెలిపారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే కూతురే ఈ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే. క్లినికల్ సెంటర్లను విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కుండ బద్దలు కొట్టారు.
ఆమె మానసిక, శారీరక వికలాంగులతో కలిసి చాలా సేపు మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read : వసూళ్లలో పొన్నియిన్ సెల్వన్ హవా