Mulayam Singh Yadav : రాజకీయ రంగంపై చెరగని ముద్ర
దేశం కోల్పోయిన రాజకీయ దిగ్గజం
Mulayam Singh Yadav : సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav) ఇక లేరన్న వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. కొన్నేళ్లుగా ఆయన అటు యూపీలో ఇటు దేశంలో పరోక్షంగా ప్రత్యక్షంగా తనదైన ప్రభావాన్ని చూపుతూ వచ్చారు. 82 ఏళ్ల వయస్సులో ములాయం సింగ్ యాదవ్ కన్ను మూశారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఆపై మూడు సార్లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పాలనా పరంగా తనదైన ముద్ర కనబర్చారు.
అంతే కాదు ప్రముఖ సోషలిస్టు నాయకుడిగా పేరొందారు. జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.
సమాజ్ వాది పార్టీని ఏర్పాటు చేశారు. 1996 నుంచి 1998 దాకా భారత దేశానికి రక్షణ శాఖ మంత్రి గా పని చేశారు. ఆయనను అంతా నేతాజీగా పిలుచుకుంటారు. గత మూడేళ్లుగా జాతీయ రాజకీయ వేదికలకు దూరంగా ఉన్నారు. దేశంలోని అత్యంత సీనియర్ ప్రతిపక్ష నాయకుల్లో ఒకడిగా ఉన్నారు.
1980 చివరలో , 1990 ప్రారంభంలో దేశలో సామాజికంగా లేదా విద్యా పరంగా వెనుకబడిన తరగతులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన మండల్ కమిషన్ పై జరిగిన ఆందోళనలు పెచ్చరిల్లిన సమయంలో యూపీ రాజకీయాల్లో అనూహ్యంగా ఎదిగారు.
ములాయం సింగ్ తో పాటు బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి నేతలు వెలుగులోకి వచ్చారు.
1990లో కర సేవకులపై కాల్పులు జరపాలని ఆదేశించారు. యూపీలో ముస్లిం, యాదవ కులాలు ఒక్కటయ్యేలా చేసింది. 1996లో జాతీయ పాలిటిక్స్ లోకి వచ్చారు.
యుపీఏ సర్కార్ లో కేంద్ర మంత్రిగా ఉన్నారు. 2012లో తన తనయుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కు సీఎం పదవి కట్టబెట్టారు. కుటుంబంలో చీలికలు వచ్చాయి.
చివరకు పార్టీ నుంచి కొడుకును బహిష్కరించారు. ఆ తర్వాత ఇద్దరూ సర్దుకున్నారు. చివరకు పార్టీ సెంటర్ పాయింట్ గా ఎదిగారు అఖిలేష్ యాదవ్. 2019లో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు.
2021లో జరిగిన ఎన్నికల్లో బద్ద శత్రువులుగా మారి పోయారు. మొత్తంగా ములాయం సింగ్ యాదవ్ ప్రస్థానం విజయాలతో నిండి ఉన్నది.
Also Read : అత్యవసర సమయంలో కీలక సైనికుడు