Mulayam Singh Yadav Comment : ములాయం రాజకీయ దిగ్గజం
55 ఏళ్ల రాజకీయ ప్రస్థానం
Mulayam Singh Yadav Comment : భారత దేశ రాజకీయాలలో ఒక శకం ముగిసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సోషలిస్టు నాయకుడిగా పేరొందిన ఉత్తర ప్రదేశ్ కు చెందిన ములాయం సింగ్ యాదవ్ ఇక సెలవంటూ వెళ్లి పోయారు. 82 ఏళ్లు బతికారు. ఒక రకంగా ప్రజల గొంతుకగా ఉన్నారు. నిలిచారు..పోరాడారు.
చివరి దాకా సోషలిస్టుగా ఉండేందుకు ప్రయత్నం చేశారు. ఆ దిశగా ఆయన సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా తనదైన
ముద్ర కనబరిచారు. మూడు సార్లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు.
ఎక్కడ కూడా ఘర్షణ పడిన దాఖలాలు లేవు. అందుకే ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు కూడా ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav) కు వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగిన నేతగా వినుతికెక్కారు. ప్రధానమంత్రి మోదీ అత్యవసర కాలంలో నిలిచిన సైనికుడంటూ కితాబు ఇచ్చారు.
ఇక ట్రబుల్ షూటర్ అమిత్ షా అయితే రాజకీయాలలో చివరి శకం ముగించిందని పేర్కొన్నారు. ములాయం లేక పోవడం రాజకీయంగా శూన్యంగా ఉందన్నారు మాయావతి. ఇది పక్కన పెడితే 10 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 7 సార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు ములాయం సింగ్ యాదవ్.
ఎనిమిది దశాబ్దాలుగా సాగించిన ఈ ప్రయాణంలో చివరి వరకు పోరాడుతూనే ఉన్నారు. వ్యక్తిగత విజయాలు ఉన్నాయి. దాంతో పాటే వైఫల్యాలు కూడా ఉన్నాయి. తన పొలిటికల్ కెరీర్ లో కొడుకుపై నిషేధం విధించడం ఆయనకు మాత్రమే చెల్లింది. భారత రాజకీయాలలో కీలకమైన సోషలిస్ట్ తత్వాన్ని ప్రతిబింబించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
సామాజిక న్యాయం అనే లేబుల్ లో రూపొందించబడిన కుల, మత రాజకీయాల సంగమాన్ని సూచిస్తుంది. 1990, 2000లలో యూపీలో బీజేపీ ఎదుగుదలను ములాయం అడ్డంకిగా నిలిచారు. ఆ తర్వాత తను రాజకీయాలకు దూరంగా ఉండటం కాషాయానికి ఓ స్పేష్ దొరికింది.
1960, 1970లలో కాంగ్రెస్ బ్రాహ్మణ , ముస్లిం – దళిత సంకీర్ణం , సామాజిక సమూహాలు , వెనుకబడిన వర్గాలు తమను తాము ఏకం అయ్యేలా చేయడంలో
కీలక పాత్ర పోషించారు ములాయం. 1967లో జరిగిన ఎన్నికలు ఉత్తర భారత రాజకీయాలలో కాంగ్రెస్ ఆధిపత్యానికి బ్రేక్ గా నిలిచాయి.
తను లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ , రామ్ మనోహర్ లోహియాతో పాటు చౌదరి చరణ్ సింగ్ ను ఆదర్శంగా తీసుకున్నారు. వారి ఆశయాలను,
ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యారు ములాయం సింగ్ యాదవ్. ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లాడు. ధైర్యంగా ఎదుర్కొన్నాడు.
ఆ తర్వాత యూపీలో ఆయనకు ఎదురే లేకుండా పోయింది. జనతాదళ్ , భారతీయ లోక్ దళ్ ల సంయుక్త అధికారాన్ని మొదట చేపట్టడంలో ములాయం సింగ్ యాదవ్ అద్భుతమైన రాజకీయ నైపుణ్యాలను ప్రదర్శించారు. 1980, 1990లో రేగిన మండల్, మందిర్ వివాదాలను ఎదుర్కొన్నారు.
కార్పొరేట్లకు సపోర్ట్ చేశాడన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఏది ఏమైనా భారతీయ రాజకీయ రంగంలో నిబద్దత కలిగిన సోషలిస్టు స్తంభం కూలి పోయింది.
Also Read : ములాయం మృతి తీరని లోటు – అమిత్ షా