INDW vs THW Asia Cup : సెమీస్ లో భార‌త్ థాయ్ లాండ్ ఢీ

ఫీల్డింగ్ ఎంచుకున్న థాయ్ లాండ్

INDW vs THW Asia Cup :  మ‌హిళ‌ల ఆసియా క‌ప్ – 2022లో మొద‌టి సెమీ ఫైన‌ల్ ప్రారంభ‌మైంది. భార‌త్ , థాయ్ లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఇవాళ కొన‌సాగుతోంది. థాయ్ లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భార‌త మ‌హిళా జ‌ట్టు(INDW vs THW Asia Cup) బ్యాటింగ్ కు దిగింది. టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన అన్ని మ్యాచ్ ల‌లో ఒక్క పాకిస్తాన్ తో మాత్ర‌మే ఓడి పోయింది భార‌త జ‌ట్టు.

ఇప్ప‌టికే థాయ్ లాండ్ ను క‌ట్ట‌డి చేసింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది లీగ్ మ్యాచ్ లో. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో స‌త్తా చాటుతోంది భార‌త మ‌హిళా జ‌ట్టు. లీగ్ ద‌శ‌లో భాగంగా జ‌రిగిన మ్యాచ్ లో భార‌త జ‌ట్టు బౌల‌ర్లు దుమ్ము రేపారు. ఏకంగా ప్ర‌త్య‌ర్థి థాయ్ లాండ్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించారు.

కేవ‌లం 37 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసి విస్తు పోయేలా చేశారు. ఏ కోశాన భార‌త జ‌ట్టు బౌల‌ర్ల‌ను ఎదుర్కొన లేక పోయింది థాయ్ లాండ్. త‌క్కువ స్కోర్ కే చాప చుట్టేసింది. పూర్తి ఓవ‌ర్లు ఆడ‌కుండానే త‌ల వంచింది. కేవ‌లం థాయ్ లాండ్ జ‌ట్టు 15.1 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆడింది.

ఇక ఆతిథ్య డిఫెండింగ్ ఛాంపియ‌న్ బంగ్లాదేశ్ తో తొలిసారి ఆసియా క‌ప్ సెమీ ఫైన‌ల్ లోకి ప్ర‌వేశించింది థాయ్ లాండ్. భార‌త్ పై త‌మ మునుప‌టి బ్యాటింగ్ ప్ర‌య‌త్నం కంటే మ‌రింత మెరుగ్గా ఆడాల‌ని చూస్తోంది.

న‌రుఎమోల్ చైవాయి నేతృత్వంలోని జ‌ట్టు ఎలాగైనా భార‌త్ ను ఢీకొనాల‌ని య‌త్నిస్తోంది. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్ లో ఆడ‌నుంది.

Also Read : బాస్ ఎవ‌రైనా ‘జే షా’నే బాద్ షా

Leave A Reply

Your Email Id will not be published!