Ravi Shastri : బిన్నీ రాక‌తో బీసీసీఐకి మంచి రోజులు

మాజీ భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ ర‌వి శాస్త్రి

Ravi Shastri : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ హెడ్ కోచ్ ర‌వి శాస్త్రి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టు స‌భ్యుడిగా ఉన్న మాజీ ఆల్ రౌండ‌ర్ , మాజీ సెలెక్ట‌ర్ రోజ‌ర్ బిన్నీపై ప్ర‌శంస‌లు కురిపించాడు. త‌న మాజీ స‌హ‌చ‌రుడు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ గా ఎన్నిక కానున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగ‌తోంది.

దీనిపై గురువారం స్పందించాడు ర‌వి శాస్త్రి. రోజ‌ర్ బిన్నీ అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాలు క‌లిగిన వ్య‌క్తిగా కొనియాడారు. అంతే కాదు నాయ‌క‌త్వ నైపుణ్యం క‌లిగిన మాజీ క్రికెట‌ర్ అంటూ పేర్కొన్నాడు ర‌వి శాస్త్రి(Ravi Shastri). బిన్నీ విజ‌య‌వంత‌మైన బీసీసీఐ అధ్య‌క్షుడిగా ఎద‌గ‌డానికి , భార‌త క్రికెట్ ను ముందుకు తీసుకు వెళ్లేందుకు ఇప్ప‌టికే ప‌లు ప్ర‌య‌త్నాలు చేశాడ‌ని తెలిపాడు.

ఇప్ప‌టికే బీసీసీఐ బాస్ గా ఉన్న సౌర‌వ్ గంగూలీ త‌న ప‌ద‌వీ కాలం పూర్త‌యింది. ఈనెల 18న బీసీసీఐ కార్య‌వ‌ర్గానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రోజ‌ర్ బిన్నీ బీసీసీఐ చీఫ్ గా ఎన్నిక‌య్యేందుకు అన్ని మార్గాలు పూర్త‌య్యాయి. ఐసీసీ చైర్మ‌న్ రేసులో ఉన్నార‌ని అనుకున్నా అది కూడా లేద‌ని స‌మాచారం.

అంతే కాకుండా బీసీసీఐ ప్ర‌స్తుతం ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) చైర్మ‌న్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేసినా త‌న‌కు వ‌ద్ద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. రాబోయే కాలంలో బిన్నీ ఆధ్వ‌ర్యంలో బీసీసీఐ మ‌రింత స‌మ‌ర్థ‌వంత‌మైన క్రీడా సంస్థ‌గా ఎదగ‌డం ఖాయ‌మ‌ని ఆశా భావం వ్య‌క్తం చేశారు ర‌వి శాస్త్రి(Ravi Shastri). ముంబై లో మీడియాతో మాజీ హెడ్ కోచ్ మాట్లాడారు.

Also Read : సెమీస్ లో భార‌త్ థాయ్ లాండ్ ఢీ

Leave A Reply

Your Email Id will not be published!