INDW vs SLW Asia Cup 2022 : ఆసియా క‌ప్ టీమిండియాదే

స‌త్తా చాటిన స్మ‌తి మంధాన 21 బంతులు 51

INDW vs SLW Asia Cup 2022 : హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు అద్భుతం సాధించింది. వ‌రుస‌గా ఏడ‌వ సారి మ‌హిళ‌ల ఆసియా క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. సిల్హెట్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఆసియా క‌ప్ ఫైన‌ల్ లో టీమిండియా(INDW vs SLW Asia Cup 2022) శ్రీ‌లంక జ‌ట్టును ఓడించింది. 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

భార‌త స్టార్ మ‌హిళా క్రికెట‌ర్ స్మృతి మంధాన ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగింది. కేవలం 25 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న మంధాన 51 ప‌రుగులు చేసింది. నాటౌట్ గా నిలిచింది. భార‌త జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. శ్రీ‌లంక జ‌ట్టు స్కిప్ప‌ర్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసింది.

భార‌త జ‌ట్టు బౌల‌ర్లు దుమ్ము రేపారు. బౌల‌ర్ల దెబ్బ‌కు శ్రీ‌లంక బ్యాట‌ర్లు విల‌విల‌లాడారు. ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. కేవ‌లం 66 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ముందుంచింది భార‌త్ జ‌ట్టు ముందు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌కు గాను కేవ‌లం 8.3 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. ఆసియా క‌ప్ టైటిల్ను గెలుచుకుంది.

ఇదిలా ఉండ‌గా 9 వికెట్ల న‌ష్టానికి 65 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది శ్రీ‌లంక జ‌ట్టు. రేణుకా సింగ్ ఠాకూర్ మూడు వికెట్లు తీయ‌గా రాజేశ్వ‌రి గైక్వాడ్ , స్నేహ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. ఇదిలా ఉండ‌గా సెమీస్ లో పాకిస్తాన్ తో ఆడిన జ‌ట్టునే తిరిగి కొన‌సాగించింది శ్రీ‌లంక‌. ఇక భార‌త జ‌ట్టులో కీల‌క మార్పు చోటు చేసుకుంది.

రాధా యాద‌వ్ స్థానంలో ద‌యాళ‌న్ హేమ‌ల‌త ను తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా భార‌త జ‌ట్టు ఆసియా క‌ప్ గెల‌వ‌డంతో ప‌లువురు అభినంద‌న‌లు తెలిపారు.

Also Read : ఒకే ఫ్రేమ్ లో 16 మంది కెప్టెన్లు

Leave A Reply

Your Email Id will not be published!