P Chidambaram : ఎవరు ఎన్నికైనా గాంధీల మాట వినాలి
స్పష్టం చేసిన సీనియర్ నేత పి. చిదంబరం
P Chidambaram : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి. చిదంబరం(P Chidambaram) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం అత్యంత ప్రతిష్టాత్మకమైన పార్టీకి సంబంధించిన అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు ముగిశాయి. మొత్తం పార్టీ పరంగా 9, 500 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం.
ఉదయం 10 గంటలకు మొదలు కాగా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మొదటి ఓటు పి. చిదంబరం ఉపయోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం పి. చిదంబరం(P Chidambaram) మీడియాతో మాట్లాడారు. కొత్తగా పార్టీకి సంబంధించి ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైనా వారు తప్పనిసరిగా సోనియా గాంధీ కుటుంబానికి చెందిన వారి సలహాలు , సూచనలు వినాలని కోరారు.
గాంధీల స్వరం తగ్గుతుందని ఎవరూ అనడం లేదని స్పష్టం చేశారు. కొత్తగా ఎవరు ఎన్నికైనా గాంధీ కుటుంబం చేతిలో రిమోట్ కంట్రోల్ గా ఉంటారంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఆయన కొట్టి పారేశారు. దేశంలో ఏ పార్టీకి లేనంత చరిత్ర తమ పార్టీకి ఉందన్నారు.
ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీకి అంత సీన్ లేదన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్రకు అపూర్వమైన రీతిలో ఆదరణ లభిస్తోందని చెప్పారు. అయితే దశాబ్దాల తర్వాత తొలిసారిగా గాంధీయేతర వ్యక్తిని చీఫ్ గా ఎన్నుకోనుండడం విశేషమని పేర్కొన్నారు చిదంబరం.
కొత్త అధ్యక్షుడు పార్లమెంటరీ బోర్డు, పార్టీ ఫోరమ్ లలో వారి అభిప్రాయాలను తప్పనిసరిగా వినాలని స్పష్టం చేశారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు. ఇదిలా ఉండగా చిదంబరం చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : పోలింగ్ ముగిసింది ఫలితమే మిగిలింది