Liz Truss : గ‌త ప్ర‌భుత్వం తప్పులు చేసింది – లిజ్ ట్ర‌స్

బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Liz Truss : బ్రిట‌న్ నూత‌న ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరిన లిజ్ ట్ర‌స్(Liz Truss) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె గ‌తంలో బోరిస్ జాన్స‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన విదేశాంగ శాఖను నిర్వ‌హించారు. అనంత‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లో పీఎంగా గెలుపొందారు. ప్ర‌వాస భార‌తీయుడైన రిషి సున‌క్ తో గ‌ట్టి పోటీ ఎదుర్కొన్నారు.

తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. తాను దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గ‌త నెల‌లో ప్ర‌భుత్వం మినీ బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన సంద‌ర్భంగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఆర్థిక ప‌ర‌మైన చ‌ర్య‌ల దెబ్బ‌కు బ్రిటిష్ మార్కెట్ రంగంపై ప్ర‌భావం చూపింది.

దీంతో ఒక్క‌సారిగా ప్ర‌ధాని లిజ్ ట్ర‌స్(Liz Truss) పై తీవ్ర వ్య‌తిరేకత వెల్లువెత్తింది. ఒక్క‌సారిగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త రావ‌డంతో గ‌త్యంత‌రం లేక ప్ర‌ధాన మంత్రి రంగంలోకి దిగింది. తాను తీసుకున్న ఈ చ‌ర్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా తాను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు తెలిపారు.

జ‌రిగిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుతాన‌ని చెప్పారు. కొత్త ఛాన్స‌ల‌ర్ ను నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు. దేశంలో ఆర్థిక స్థిర‌త్వం, ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పున‌రుద్ద‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి ఎన్నుకున్నందున ఆ ప‌నిని కొన‌సాగిస్తాన‌న్నారు లిజ్ ట్ర‌స్.

గాడి త‌ప్పిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స‌క్ర‌మ స్థితిలో తీసుకు వ‌చ్చేందుకు ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ ను నియ‌మించిన‌ట్లు లిజ్ ట్ర‌స్ చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఆదాయ‌పు ప‌న్ను స‌హా ఇత‌ర ట్యాక్స్ ల‌కు సంబంధించి నిర్ణ‌యాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

Also Read : స‌రిహ‌ద్దు వివాదంపై జై శంక‌ర్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!