Roger Binny : అంద‌రి క‌ళ్లు రోజ‌ర్ బిన్నీ పైనే

బీసీసీఐ బాస్ గా కొత్త బాధ్య‌త

Roger Binny : దేశ వ్యాప్తంగా ఇవాళ హాట్ టాపిక్ గా మారి పోయారు రోజ‌ర్ బిన్నీ(Roger Binny). భార‌త క్రికెట్ జ‌ట్టులో ఒక‌ప్పుడు సేవ‌లు అందించాడు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ కు చీఫ్ గా ఉన్నాడు. 1983లో క‌పిల్ దేవ్ నేతృత్వంలో భార‌త జ‌ట్టు గెలుపొందిన వ‌ర‌ల్డ్ క‌ప్ లో స‌భ్యుడు కూడా .

ఇంత‌కంటే ఎక్కువ‌గా చెప్పుకోవాల్సింది వివాదాల‌కు దూరంగా ఉంటాడు బిన్నీ. సౌమ్యుడు. ఒక ర‌కంగా చెప్పాలంటే రాజ‌కీయాలు తెలియ‌ని క్రికెట‌ర్. కానీ బీసీసీఐలో నిత్యం రాజ‌కీయాలే న‌డుస్తుంటాయి. ప్ర‌స్తుతం గంగూలీ స్థానంలో బీసీసీఐకి 36వ అధ్యక్షుడిగా ఎన్నిక‌య్యాడు.

బీసీసీఐ పోస్ట్ మామూలుది కాదు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ‌ల్లో ఒక‌టిగా పేరొందిన బీసీసీఐకి ప్రాతినిధ్యం వ‌హించ‌డం క‌త్తి మీద సాము చేయ‌డం లాంటిది. ఆయ‌న మూడు సంవ‌త్స‌రాల పాటు బీసీసీఐ బాస్ గా ఉంటారు.

గంగూలీకి ఉన్నంత చ‌రిష్మా కానీ చతుర‌త‌, ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు బిన్నీకి(Roger Binny). కానీ మంచి వ్య‌క్తిగా, అడ్మినిస్ట్రేట‌ర్ గా గుర్తింపు పొందారు.

ఇక బిన్నీ త‌న కెరీర్ లో ఎన్నో మ‌లుపులు ఉన్నాయి. 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ లో విండీస్ పై అద్భుతంగా రాణించాడు. 18 వికెట్లు తీశాడు. 1985లో ఆస్ట్రేలియాలో జ‌రిగిన వ‌ర‌ల్డ్ సీరీస్ లో 17 వికెట్లు తీసి రికార్డు నెల‌కొల్పాడు బిన్నీ. త‌న అంట‌ర్జాతీయ టెస్ట్ కెరీర్ ను బెంగ‌ళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ప్రారంభించాడు.

1979లో పాకిస్తాన్ పై ఆడాడు. 1980లో ఆస్ట్రేలియాపై వ‌న్డేలో అరంగేట్రం చేశాడు. మంచి బ్యాట‌ర్ గా కూడా గుర్తింపు పొందాడు. ఇమ్రాన్ ఖాన్ , న‌వాజ్ లాంటి బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్నాడు. స్వింగ్ బౌల‌ర్ గా , ఫీల్డ‌ర్ గా గుర్తింపు పొందాడు. ఆ త‌ర్వాత ఆల్ రౌండ‌ర్ గా స్థిర‌ప‌డ్డారు బిన్నీ.

ఆనాటి వ‌ర‌ల్డ్ క‌ప్ లో అమ‌ర్ నాథ్, క‌పిల్ దేవ్ తో పాటు బిన్నీ కూడా హీరోగా నిలిచాడు. ప్ర‌స్తుతం బిన్నీకి 67 ఏళ్లు. బీసీసీఐ బాస్ గా త‌న‌దైన ముద్ర క‌న‌బరుస్తార‌ని ఆశిద్దాం.

Also Read : ఐసీసీ చైర్మ‌న్ అభ్య‌ర్థిపై బీసీసీఐ డైలమా

Leave A Reply

Your Email Id will not be published!