Elnaz Rekabi : హిజాబ్ ధిక్కారం ఇరాన్ అథ్లెట్ కు స్వాగతం
దేశ రాజధాని టెహరాన్ లో గ్రాండ్ వెల్ కమ్
Elnaz Rekabi : హిజాబ్ వివాదం ఇరాన్ దేశాన్ని అట్టుడికేలా చేసింది. ఇప్పటికే హిజాబ్ ధరించ లేదంటూ ఓ మహిళను అరెస్ట్ చేసి లాకప్ లో చిత్రహింసలకు గురి చేయడం..ఆమె మరణించడంతో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. చాలా మంది మహిళలు ఇరాన్ సర్కార్ తీరును నిరసిస్తూ తమ జుత్తును కత్తరించుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన మహిళలకు మద్దతు లభిస్తోంది. ఈ తరుణంలో ఇరాన్ కు చెందిన ప్రముఖ అథ్లెట్ ఎలాంటి హిజాబ్ (ముసుగు) లేకుండా ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు చేరింది. ఆమెకు ఎయిర్ పోర్టు వద్ద భారీ ఎత్తున ప్రజలు సాదర స్వాగతం తెలిపింది.
ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా బహిరంగంగా ధిక్కరిస్తూ ఆదివారం సియోల్ లో జరిగిన ఆసియా స్పోర్ట్స్ క్లైంబింగ్ ఛాంపియన్ షిప్ లో తలకు స్కార్ఫ్ లేకుండా పాల్గొంది.
ప్రొఫెసనల్ క్లైమర్ కు వేలాది మంది ప్రజలు ఘన స్వాగతం పలికారు. హిజాబ్ ధరించకుండా ఇరాన్ అథ్లెట్ ఎల్నాజ్ రెకాబీ(Elnaz Rekabi) పాల్గొంది.
ఈ విధంగా తన నిరసనను తెలియ చేసింది. ఆమెపై ఇరాన్ ప్రభుత్వం విచారణ చేపట్టనుందని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొడుతూ టెహరాన్ లోకి అడుగు పెట్టంది. బుధవారం తెల్లవారుజామున వీధుల్లో వేలాది మంది బారులు తీరి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. రెకాబీని ఇరాన్ జైలుకు పంపే అవకాశం ఉందని సమాచారం.
కాగా హిజాబ్ ఆదేశాలను కావాలని ఆమె ధిక్కరించిందని ఇరాన్ సర్కార్ ఆరోపించింది. ఈ ఘటనపై ఆమె ఇరాన్ ప్రజలకు క్షమాపణ చెప్పింది కూడా.
Also Read : బిల్కిస్ రేప్ నిందితుల విడుదల సబబే – జోషి