Anurag Thakur : భారత్ ఎవరి మాట వినదు – అనురాగ్ ఠాకూర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కామెంట్స్ పై సీరియస్
Anurag Thakur : కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎవరి మాట వినదన్నారు. పాకిస్తాన్ లో వచ్చే ఏడాది 2023లో జరిగే ఆసియా కప్ లో భారత క్రికెట్ జట్టు పాల్గొనబోదంటూ బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జే షా ప్రకటించారు.
దీనిపై తీవ్ర రాద్దాంతం చెలరేగుతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్ట్రాంగ్ గా స్పందించింది. ఇది పూర్తిగా అనైతికమైన చర్యగా అభివర్ణించింది. అంతే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. ఈ తరుణంలో ప్రస్తుతం బీసీసీఐ వర్సెస్ పీసీబీకి మధ్య మాటల యుద్దం నడుస్తోంది.
దీంతో స్వయంగా రంగంలోకి దిగారు క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). భారత్ ఎవరి మాట వినే స్థితిలో లేదన్నారు. వన్డే ప్రపంచ కప్ ను భారత్ లో నిర్వహిస్తామని, పాకిస్తాన్ తో సహా పాల్గొనే దేశాలను సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. గురువారం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఒక రకంగా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు పీసీబీకి. షెడ్యూల్ ప్రకారం టోర్నమెంట్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జే షా చేసిన ప్రకటనపై పీసీబీ లేఖ రాయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు మంత్రి. ఆసియా కప్ ను తటస్థ వేదికగా మార్చి వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న వరల్డ్ కప్ నుంచి వైదొలుగుతామని బెదిరిస్తే తమకు ఏమీ కాదన్నారు.
పాకిస్తాన్ లో భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని స్పష్టం చేశారు అనురాగ్ ఠాకూర్.
Also Read : రోజర్ బిన్నీకి అజారుద్దీన్ కితాబు