Sanna Irshad Mattoo : యుఎస్ వెళ్ల‌కుండా అడ్డుకున్నారు -స‌న్నా

పులిట్జ‌ర్ విజేత జ‌ర్న‌లిస్టు షాకింగ్ కామెంట్స్

Sanna Irshad Mattoo : ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అవార్డును అందుకోవ‌డానికి అమెరికా వెళ్ల‌కుండా త‌న‌ను ఢిల్లీలోని ఎయిర్ పోర్టులో నిలిపి వేశారంటూ స‌న్నా ఇర్షాద్ మ‌ట్టూ ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ విష‌యం అమెరికాకు కూడా తెలుస‌న్నారు. ఆమె కాశ్మీరీ నుంచి వార్త‌లు సేక‌రిస్తూ రాస్తున్నారు. ఆమెకు పులిట్జ‌ర్ అవార్డు ద‌క్కింది.

దానిని అందుకునేందుకు స‌న్నా ఇర్షాద్ మ‌ట్టు వెళ్లేందుకు సిద్ద‌మైంది. కానీ వెళ్ల‌కుండా ఇమ్మిగ్రేష‌న్ అధికారులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఆమెను యుఎస్ వెళ్ల‌కుండా అడ్డుకున్నార‌నే నివేదిక‌ల గురించి త‌మ‌కు తెలుసు అని , ఈ ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్ర‌తినిధి వేదాంత్ ప‌టేల్ స్ప‌ష్టం చేశారు.

తాము ప‌త్రికా స్వేచ్ఛ‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు. సెక్ర‌ట‌రీ గుర్తించిన‌ట్లుగా ప‌త్రికా స్వాతంత్రం ప‌ట్ల గౌర‌వంతో ఇరు దేశాలైన భార‌త్ , అమెరికా ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా స‌న్నా ఇర్షాద్ మ‌ట్టూ(Sanna Irshad Mattoo) ఒక ఫ్రీలాన్స్ ఫోటో జ‌ర్న‌లిస్ట్.

భార‌త దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌వ‌రేజ్ కోసం ఫీచ‌ర్ ఫోటోగ్ర‌ఫీకి పులిట్జ‌ర్ బ‌హుమ‌తిని గెలుచుకున్న రాయిట‌ర్స్ బృందం ఆమె భాగంగా ఉన్నారు. ఇదే క్ర‌మంలో పులిట్జ‌ర్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వానికి హాజ‌ర‌య్యేందుకు మ‌ట్టూ అమెరికా వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని జ‌ర్న‌లిస్టుల ర‌క్ష‌ణ క‌మిటీ ఒక ప్ర‌క‌ట‌న‌లో కోరింది.

అన్ని స‌రైన ప్ర‌యాణ ప‌త్రాలు క‌లిగి ఉన్నారు స‌న్నా ఇర్షాద్ మ‌ట్టూ. జ‌ర్న‌లిజం అవార్డులలో ఒక‌టి పులిట్జ‌ర్. కాశ్మీరీ జ‌ర్న‌లిస్ట్ ను కావాల‌ని పంప‌లేద‌ని ఆరోపించారు సీపీజే ఆసియా ప్రోగ్రామ్ బెహ్ లిహ్ యి .

Also Read : నితీష్ బీజేపీతో చేతులు క‌లిపే ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!