Tamilisai Soundararajan : చిన్నారి రేప్ పై గవర్నర్ ఫైర్
తక్షణమే పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం
Tamilisai Soundararajan : హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై గత రెండు నెలలుగా ప్రిన్సిపాల్ కు చెందిన డ్రైవర్ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. చివరకు విషయం తెలుసుకున్న పేరెంట్స్ చితక బాదారు.
రేప్ కు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Tamilisai Soundararajan) తీవ్రంగా స్పందించారు. వెంటనే తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వివిధ మీడియా మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు గవర్నర్. ఇదిలా ఉండగా చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన పాఠశాల ప్రిన్సిపాల్ డ్రైవర్ ను బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలి బంధువులు , ఇతరుల నిరసనలతో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రిన్సిపాల్ మాధవిని అరెస్ట్ చేశారు. చిన్నారిపై రేప్ కు పాల్పడిన 34 ఏళ్ల బీమన రజనీకుమార్ ను జైలుకు తరలించారు. 376ఏ, బి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
స్కూల్ లో అడ్మినిస్ట్రేషన్ పనులు చూసుకునేందుకు ప్రిన్సిపాల్ మాధవి డ్రైవర్ రజనీకుమార్ కు స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో ఈ దారుణానికి పాల్పడుతూ వచ్చాడు.
Also Read : ఎన్నికల కమిషన్ పై కేటీఆర్ ఫైర్