NZ vs AUS T20 World Cup : చెలరేగిన కీవీస్ తలవంచిన ఆసిస్
టి20 వరల్డ్ కప్ లో చాంపియన్ కు షాక్
NZ vs AUS T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసిస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది న్యూజిలాండ్. 89 పరుగుల తేడాలో విజయం సాధించింది. అంతకు ముందు కీవీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే అద్భుతంగా ఆడాడు. కీవీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 92 పరుగులతో దుమ్ము రేపాడు.
దీంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్(NZ vs AUS T20 World Cup) కేవలం 3 వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించ లేక చతికిల పడింది. 2011 తర్వాత ఏ ఫార్మాట్ లోనైనా ఆస్ట్రేలియాలో ఆసిస్ పై కీవీస్ సాధించిన తొలి విజయం ఇది.
గత ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2021 లో ఫైనల్ లో ఓటమి పాలైనందుకు ప్రతీకారం తీర్చుకుంది న్యూజిలాండ్. సిడ్నీ వేదికగా జరిగిన సూపర్ -12 మ్యాచ్ లో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆసిస్ కేవలం 111 పరుగులకే చాప చుట్టేసింది. ఇక కాన్వే 58 బంతులు ఆడి 92 రన్స్ తో బెంబేలు ఎత్తించాడు ఆసిస్ బౌలర్లకు.
ఇందులో 7 ఫోరర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక బౌలర్ల పరంగా చూస్తే మిచెల్ సాంట్నర్ , టిమ్ సౌథీ చెరో మూడు వికెట్లు తీశారు. ఆసిస్ బ్యాటింగ్ లైనప్ ను నేల కూల్చారు. మరో వైపు ఆదివారం మరో కీలకమైన మ్యాచ్ కు వేదిక కానుంది. దాయాదులైన భారత్, పాకిస్తాన్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటికే టికెట్లు పూర్తిగా సేల్ అయ్యాయి.
Also Read : పాకిస్తాన్ పై ఆడడం ‘సూర్య’కు కష్టం