Rishi Sunak Comment : ప‌వ‌ర్ పాలిటిక్స్ లో ‘సున‌క్’ సునామీ

ఆశావాద దృక్ప‌థం విజ‌యానికి సోపానం

Rishi Sunak Comment : బ్రిట‌న్ లో ఎట్ట‌కేల‌కు రాజ‌కీయ సంక్షోభం ముగిసింది. అంతా అనుకున్న‌ట్టు గానే భార‌తీయ మూలాలు క‌లిగిన రిషి సున‌క్ ప్ర‌ధాన‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. యునైటెడ్ కింగ్ డ‌మ్ చ‌రిత్ర‌లో మొద‌టిసారిగా ప్ర‌వాస భార‌తీయుడు పీఎంగా ఎన్నిక కావ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

అంత‌కు ముందు ఎన్నో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న బోరిస్ జాన్స‌న్ పై తీవ్రమైన అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో పార్టీలోనే ముస‌లం రేగింది. ఇద్ద‌రు కీల‌క మంత్రులు త‌మ ప‌ద‌వుల నుంచి త‌ప్పుకున్నారు. పీఎం ప‌ద‌వికి గ‌త్యంత‌రం లేక జాన్స‌న్ రాజీనామా చేశారు.

నాలుగు ద‌శ‌ల్లో ఎన్నిక ప్ర‌క్రియ జ‌రిగింది. ఆ స‌మ‌యంలో రిషి సున‌క్, లిజ్ ట్ర‌స్ , పెన్నీ మార్డెంట్ బ‌రిలో నిలిచారు. చివ‌రి వ‌ర‌కు నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. ఇద్ద‌రి మ‌ధ్య లిజ్ ట్ర‌స్ విజ‌యం సాధించారు. 45 రోజుల కింద‌ట బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రిగా లిజ్ ట్ర‌స్ కొలువు తీరారు.

తీరా దేశంలో నెల‌కొన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కంట్రోల్ చేయ‌లేక చేతులెత్తేశారు. తాను ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అంద‌రినీ విస్తు పోయేలా చేశారు. అధికార క‌న్జ‌ర్వేటివ్ పార్టీలో మ‌ళ్లీ ఎవ‌రు పీఎంగా ఉండాల‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

చివ‌రి వ‌ర‌కు మ‌రోసారి ముగ్గురు పోటీలో నిలిచారు. వారిలో ఒక‌రు మాజీ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్ కాగా మ‌రొక‌రు రిషి సున‌క్ , పెన్నీ. అక్టోబ‌ర్ 23న ఉన్న‌ట్టుండి తాను పీఎం రేసు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు మాజీ ప్ర‌ధాని జాన్స‌న్. దీంతో రిషి సున‌క్(Rishi Sunak) కు మార్గం సుగ‌మ‌మైంది.

పెన్నీ ఆశించిన స్థాయిలో స‌భ్యుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌లేక పోయింది. చివ‌ర‌కు రిషి సున‌క్ సునాస‌యంగా పీఎం పీఠంపై కొలువు తీర‌నున్నారు. ఇదంతా

ప‌క్క‌న పెడితే రిషి సున‌క్ ముందు నుంచీ కొన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌న‌ను తాను నాయ‌కుడిగా ప్రూవ్ చేసుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

గ‌త కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా ప‌ని చేశారు. ఆయ‌న పూర్వీకులు పంజాబ్ కు చెందిన వారు. మ‌రో వైపు భార‌తీయ ప్ర‌ముఖ ఐటీ కంపెనీల‌లో ఒక‌టైన

ఇన్ఫోసిస్ నారాయ‌ణ మూర్తి కూతురు అక్ష‌తా మూర్తిని పెళ్లి చేసుకున్నారు. సుధా నారాయ‌ణ‌మూర్తికి అల్లుడు. భారీ ఎత్తున వ్యాపారాలు ఉన్నాయి.

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తాను గాడిలో పెడ‌తాన‌ని, బ్రిట‌న్ కు పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చేలా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆ సానుకూల ప్ర‌క‌ట‌నలే రిషి సున‌క్

కు పీఎం ప‌ద‌వి వ‌రించేలా చేశాయి. ఈసారి జాన్స‌న్ ,పెన్నీల‌కు షాక్ ఇచ్చారు. ఆపై పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో స‌క్సెస్ అయ్యారు సున‌క్. పార్ల‌మెంట్ లో భ‌గ‌వ‌ద్గీత‌పై యార్క్ షైర్ ఎంపీగా ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేశారు. అలా చేసిన మొద‌టి పార్ల‌మెంటేరియ‌న్ గా 

చ‌రిత్ర సృష్టించారు. ఆయ‌న పేరెంట్స్ భార‌త సంత‌తికి చెందిన వారు.

ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. రిషి సున‌క్ త‌న వార‌స‌త్వం గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తుంటారు. విలువ‌లు, సంస్కృతి గురించి గొప్ప‌గా చెబుతుంటారు. ఆయ‌న మాజీ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక‌ర్. 

ఆయ‌న నిక‌ర ఆస్తుల విలువ 700 మిలియ‌న్ పౌండ్ల‌కు పైగా ఉంది. యుకెలో చాలా ఆస్తులు క‌లిగి ఉన్నారు. రిషి సున‌క్ తాత‌లు 

పంజాబ్ కు చెందిన వారు. 2020లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

క‌రోనా స‌మ‌యంలో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు ప్ర‌శంస‌కు నోచుకున్నాయి. ఇదిలా ఉండ‌గా 42 ఏళ్ల వ‌య‌సు ఉన్న రిషి సున‌క్ 200 ఏళ్ల‌లో బ్రిట‌న్ లో అతి పిన్న వ‌య‌స్సు క‌లిగిన ప్ర‌ధాన‌మంత్రి కావ‌డం భార‌తీయుల‌కు గ‌ర్వ కార‌ణం. 

ఏది ఏమైనా ఆశావాద దృక్ప‌థం అంద‌లం ఎక్కించేలా చేసింది.

Also Read : బ్రిట‌న్ ప్ర‌ధానిగా రిషి సున‌క్ ఎన్నిక‌

Leave A Reply

Your Email Id will not be published!