Narayana Murthy : అల్లుడు పీఎం ఇన్ఫోసిస్ చైర్మన్ సంతోషం
బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునక్ ఎన్నిక
Narayana Murthy : భారతీయ మూలాలు కలిగిన రిషి సునక్(Rishi Sunak) బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నా చివరకు ఉత్కంఠ భరిత పోరులో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు రిషి సునక్. భారీ విజయాన్ని నమోదు చేశారు. మాజీ ప్రధాన మంత్రి బోరీస్ జాన్సన్ , పెన్నీ మార్డెంట్ మధ్య గట్టి పోటీ ఎదుర్కొన్నారు రిషి సునక్.
చివరకు అనూహ్యంగా ఆయన పీఎం పోస్ట్ కు ఎన్నిక కావడం పార్టీలోని కొందరిని విస్తు పోయేలా చేసింది. ఇటీవల తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న బోరీస్ జాన్సన్ తన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో ఎన్నిక అనివార్యం కావడంతో చివరకు రిషి సునక్, లిజ్ ట్రస్ మధ్య ట్రస్ విజయం సాధించారు.
ఆమె పీఎం పదవిని అధిష్టించారు. 45 రోజుల పాటు కొలువు తీరిన అనంతరం దేశ ఆర్థిక పరిస్థితిని కంట్రోల్ చేయలేనంటూ రాజీనామా ప్రకటన చేసి విస్తు పోయేలా చేశారు. ఈ తరుణంలో గట్టి పోటీ ఎదురైనా చివరకు సత్తా చాటారు. రిషి సునక్ విజేతగా నిలిచారు. ఇక రిషి సునక్ ఎవరో కాదు.
ఆయన భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి. అంతే కాదు భారత దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీలలో ఒకటిగా పేరుంది ఇన్ఫోసిస్. ఆ సంస్థ చైర్మన్ నారాయణ మూర్తి(Narayana Murthy), సుధా మూర్తి కూతురు అక్షతా మూర్తిని పెళ్లి చేసుకున్నారు రిషి సునక్. అక్షతా మూర్తి, రిషి సునక్ కు ఇద్దరు కూతుళ్లు. దీంతో తన అల్లుడు బ్రిటన్ కు ప్రధానమంత్రిగా కొలువు తీరడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Also Read : అక్షతా మూర్తి ..రిషి సునక్ సక్సెస్ సీక్రెట్