Lingayat Seer Suicide : కంచుగల్ మఠంలో ‘స్వామి’ సూసైడ్
కర్ణాటకలో వరుస ఘటనలతో విషాదం
Lingayat Seer Suicide : కర్ణాటక రాష్ట్రంలో వరుసగా మఠాలకు సంబంధించి ఆత్మహత్యలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా కంచుగల్ బందె మఠానికి చెందిన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవలింగ స్వామి ఆత్మహత్య కు(Lingayat Seer Suicide) పాల్పడ్డాడు. మృత దేహం వద్ద రెండు పేజీల సూసైడ్ నోట్ లభించింది.
దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బసవ లింగ స్వామి గత 25 ఏళ్లుగా కంచుగల్ బందె మఠంకు ప్రధాన దర్శిగా ఉన్నారు. ఈ మఠం కర్ణాటకలోని రామనగర జిల్లాలో ఉంది. ఆయనకు 45 ఏళ్లు. తనను తన స్థానం నుండి తొలగించాలని కొంత మంది ప్రయత్నం చేశారని, వేధింపులకు గురి చేశారంటూ ఆరోణలు చేశాడు.
దీనిని అసహజ మరణంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తను రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా కంచుగల్ బందె మఠానికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ మఠానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. 1997లో బసవలింగ స్వామి ప్రధాన అర్చకులుగా ఎంపికయ్యారు.
ఆనాటి నుంచి నేటి వరకు విధులు నిర్వహిస్తూ వచ్చారు మఠంలో. మఠంలోని ఓ గదిలో కిటికీ గ్రిల్ కు ఉరి వేసుకుని ఉన్నాడు. ఆయన మరణానికి సంబంధించి ఫోన్ కాల్స్ ను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తను వేధింపులకు గురయ్యానని, అందుకే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నట్లు వదిలి వెళ్లిన లేఖలో పేర్కొనడం కలకలం రేపుతోంది.
మరో వైపు మురుగ మఠంలో దారుణాలు చోటు చేసుకోడంతో అక్కడి మఠాధిపతి శివస్వామి శరణారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కన్నడ నాట బలమైన సామాజిక వర్గంగా ఉంది లింగాయత్ సామాజిక వర్గం.
Also Read : వెంకట్ రెడ్డిపై సీతక్క సీరియస్