Rahul Dravid : జ‌ట్టులో ఎలాంటి మార్పులు ఉండ‌వు

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్

Rahul Dravid : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సూప‌ర్ 12 లీగ్ మ్యాచ్ లో భాగంగా అక్టోబ‌ర్ 27 గురువారం నెద‌ర్లాండ్ తో త‌ల‌ప‌డ‌నుంది భార‌త జ‌ట్టు. ఇప్ప‌టికే క‌స‌ర‌త్తులో మునిగి పోయింది. ప్రారంభ మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.

అత్యంత ఉత్కంఠ భ‌రితంగా ఆఖ‌రు బంతి వ‌ర‌కు నువ్వా నేనా అన్న రీతిలో సాగింది మ్యాచ్. భార‌త బౌల‌ర్లు త‌క్కువ స్కోర్ కే క‌ట్ట‌డి చేశారు పాకిస్తాన్ ను. 160 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా ఆది లోనే వికెట్లను కోల్పోయి ఇక్క‌ట్ల‌కు గురైంది. ఈ త‌రుణంలో మైదానంలోకి వ‌చ్చిన భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ము రేపాడు.

53 బంతులు ఆడి 82 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. చివ‌రి దాకా ఉండి జ‌ట్టును గెలిపించాడు. కోహ్లీతో పాటు పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించాడు హార్దిక్ పాండ్యా 30 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కోహ్లీకి స‌పోర్ట్ గా ఉంటూ కీల‌క పాత్ర పోషించాడు స‌క్సెస్ లో. దీంతో భార‌త జ‌ట్టు పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది.

ఇక నెద‌ర్లాండ్ ఏ కోశాన భార‌త్ కు స‌రి పోద‌ని తెలిసినా టి20 మ్యాచ్ లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ఏమైనా మార్పులు చేస్తారా అన్న దానిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid). పాకిస్తాన్ తో ఆడిన జ‌ట్టునే నెద‌ర్లాండ్ తో కొన‌సాగిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : క‌పిల్ దేవ్ ముందు నేనెంత – హార్దిక్ పాండ్యా

Leave A Reply

Your Email Id will not be published!