PAK vs ZIM T20 World Cup : పసికూనలు భళా పాకిస్తాన్ విలవిల
ఒక్క పరుగు తేడాతో గ్రాండ్ విక్టరీ
PAK vs ZIM T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే టైటిల్ ఫెవరేట్ గా పేరొందిన పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే నమీబియా చేతిలో శ్రీలంక పరాజయం పాలైంది.
ఆ తర్వాత కోలుకుంది. సూపర్-12 కు చేరుకుంది. ఈ తరుణంలో ప్రారంభ మ్యాచ్ లో దాయాది దేశాలైన పాకిస్తాన్ , భారత దేశ జట్ల మధ్య ఉత్కంఠ భరిత పోరులో టీమిండియా చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇదిలా ఉండగా రెండో లీగ్ మ్యాచ్ జింబాబ్వేతో ఆడింది పాకిస్తాన్ .
అక్టోబర్ 27 గురువారం జరిగిన ఈ కీలక మ్యాచ్ లో పసికూన దెబ్బకు పాకిస్తాన్(PAK vs ZIM T20 World Cup) విల విలలాడింది. టి20 వరల్డ్ కప్ హాట్ ఫెవరేట్ గా ఉన్న పాకిస్తాన్ కు ఒక రకంగా చెప్పాలంటే ఇది బిగ్ షాక్. విచిత్రం ఒక్క పరుగు తేడాతో గ్రాండ్ విక్టరీని సాధించింది. నాలుగు పాయింట్లను కోల్పోయింది.
ఒక రకంగా చెప్పాలంటే సెమీస్ కు చేరాలంటే మిగతా అన్ని మ్యాచ్ లను తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆఖరి బంతి వరకు ఫలితం తేలని ఈ మ్యాచ్ లో జింబాబ్వే కు షాక్ ఇచ్చింది పాకిస్తాన్. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 129 పరుగులు మాత్రమే చేసింది.
ఏడు వికెట్లను కోల్పోయింది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. చివరి దాకా జింబాబ్వే అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. పాకిస్తాన్ జట్టులో మసూద్ 44 రన్స్ చేస్తే నవాజ్ 22 పరుగులు చేశాడు. ఇక జింబాబ్వే జట్టులో సికిందర్ రజా 3, ఎవన్స్ 2 వికెట్లు తీసి పతనాన్ని శాసించారు.
Also Read : రెచ్చి పోయిన రాసో చెలరేగిన డికాక్