SA vs BAN T20 World Cup : రెచ్చి పోయిన రాసో చెలరేగిన డికాక్
103 పరుగుల తేడాతో బంగ్లాపై విక్టరీ
SA vs BAN T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 27న జరిగిన కీలక మ్యాచ్ లలో ఊహించని రీతిలో పసికూనలుగా భావించిన జింబాబ్వే చుక్కలు చూపించింది పాకిస్తాన్ కు.
ఇప్పటికే ఆ జట్టు మొదటి మ్యాచ్ లో భారత జట్టు చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇదే సమయంలో తాజాగా జరిగిన లీగ్ మ్యాచ్ లో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక రకంగా చెప్పాలంటే బాబర్ ఆజమ్ కెప్టెన్సీకి అగ్ని పరీక్షగా మారింది.
ఇదిలా ఉండగా మరో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చుక్కలు చూపించింది బంగ్లాదేశ్ కు(SA vs BAN T20 World Cup) . ప్రధానంగా సఫారీ క్రికెటర్ రిలీ రాసో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొని 107 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. గ్రౌండ్ మొత్తం కళ్లు చెదిరేలా షాట్లు కొట్టాడు.
ఒకానొక దశలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు చూస్తూ ఉండి పోయారు తప్ప రిలీ రాసోను నిలువరించ లేక పోయారు. అంతలా శివమెత్తినట్లు ..పూనకం వచ్చినట్లు ఆడాడు. మరో వైపు స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ 38 బంతులు ఎదుర్కొని 63 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి.
దీంతో రిచ్ మెగా క్రికెట్ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది దక్షిణాఫ్రికా. ఏకంగా 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. టోర్నీలో భాగంగా గత మ్యాచ్ వర్షం వల్ల మ్యాచ్ రద్దు చేశారు. దీంతో ఈ మ్యాచ్ లో రెండు పాయింట్లు సాధించింది సఫారీ టీం.
Also Read : నెదర్లాండ్స్ పై భారత్ గ్రాండ్ విక్టరీ