Vijaya Gadde : పంతం నెగ్గించుకున్న ఎలాన్ మస్క్
విజయా గద్దెకు కోలుకోలేని షాక్
Vijaya Gadde : ఎవరీ విజయా గద్దె అనుకుంటున్నారా. ఆమె తెలుగు వారి అమ్మాయి. ప్రవాస భారతీయురాలిగా గుర్తింపు పొందారు. అంతకంటే ఎక్కువగా అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో విద్వేష పూరిత ప్రచారానికి తెర తీశాడని, తన అనుచరులను ఇబ్బందులకు గురి చేసేలా ప్రోత్సహించాడంటూ మండిపడ్డారు విజయా గద్దె(Vijaya Gadde).
ఆమె మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కు లీగల్ హెడ్ గా పని చేశారు. ఏకంగా ట్విట్టర్ ట్రంప్ వ్యక్తిగత ఖాతాలను క్లోజ్ చేసింది. ఒక రకంగా ఆయనలో మార్పు వచ్చేంత వరకు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తాను గనుక పవర్ లోకి వస్తే మీ భరతం పడతానంటూ నిప్పులు చెరిగారు ట్రంప్.
అయినా ట్విట్టర్ వెనక్కి తగ్గలేదు. ట్విట్టర్ తో పాటు ఫేస్ బుక్ , గూగుల్ , ఫేస్ బుక్ , వాట్సాప్ , ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ గురించి ఎలాంటి సమాచారం రాకుండా బ్లాక్ చేశాయి. ఇదే సమయంలో ట్విట్టర్ లో లీగల్ హెడ్ గా ఉన్నారు విజయా గద్దె. ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ కు సన్నిహితుడు డొనాల్డ్ ట్రంప్.
బయట ప్రచారం కూడా ఏం జరుగుతోందంటే ట్విట్టర్ ను కొనుగోలు చేయడం వెనుక ట్రంప్ ఉన్నారని. విజయా గద్దె స్వస్థలం హైదరాబాద్. 1974లో పుట్టారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లారు. చిన్నప్పటి నుంచి పై స్థాయి వరకు అమెరికాలోనే చదువుకున్నారు.
2011లో విజయా గద్దె ట్విట్టర్ లో అడుగు పెట్టారు. ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్(Elon Musk) ఆ వెంటనే సిఇఓ పరాగ్ అగర్వాల్ , సీఎఫ్ ఓ సెగెల్ , లీగల్ హెడ్ విజయా గాద్దె లను తొలగించారు.
Also Read : మస్క్ అయితే ఏంటి రూల్స్ మారవు