MLAs Operation Comment : ఎమ్మెల్యేలు స‌రే ఆ కోట్లు ఎక్క‌డివి

ప్ర‌హ‌స‌నంగా మారిన టీఎస్ పాలిటిక్స్

MLAs Operation Comment : తెలంగాణ‌లో రాజ‌కీయాలు రోజు రోజుకు దిగ‌జారి పోతున్నాయి. స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ కొలువు తీరాక ప‌వ‌ర్ పాలిటిక్స్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి నోటుకు ఓటు కేసు క‌ల‌క‌లం రేపింది.

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యారు. జైలుకు వెళ్లారు. ఆయ‌న‌ను ఇరికించడంలో కీల‌క పాత్ర సీఎం కేసీఆర్ పోషించార‌నే ఆరోప‌ణ‌లు

అప్ప‌ట్లో వ‌చ్చాయి. ఇక కాలం ఎంత విచిత్రం అంటే అదే రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీకి చీఫ్ గా ఉన్నారు.

రెండోసారి టీఆర్ఎస్ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ, ఇత‌రులు జంప్ జిలానీలుగా మారారు. ఇప్పుడు ఎవ‌రు ఏ పార్టీలో ఉంటారో ఇంకెప్పుడు పార్టీ మారి పోతారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక రకంగా దేశంలోనే అత్యంత కాస్ట్ లీ ఎన్నిక‌లుగా ఇటీవ‌ల హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఉప ఎన్నిక చ‌రిత్ర సృష్టించింది.

తాజాగా మునుగోడు ఉప ఎన్నిక ఆ రికార్డును పూర్తి చేయ‌నుంద‌ని స‌మాచారం. ఈ త‌రుణంలో ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్(MLAs Operation).

ఇందులో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాల‌రాజు, బీరం హ‌ర్ష వ‌ర్ద‌న్ రెడ్డి (కాంగ్రెస్), పైల‌ట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతా రావు ఉన్నారు.

వీరంతా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కొలువు తీర‌డం వీరికి ఒక్కొక్క‌రికి రూ. 100 కోట్ల ఆఫ‌ర్ ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇందులో ముగ్గురు ప్ర‌ధాన సూత్ర‌ధారులుగా ఉన్నారు. వారిలో ఒక‌రు స్వామీజి ఉండ‌డం విశేషం. ఇదంతా భార‌తీయ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ అంటోంది అధికార పార్టీ.

ద‌మ్ముంటే సీబీఐతో విచార‌ణ చేప‌ట్టాల‌ని కావాల‌ని త‌న గ్రాఫ్ ప‌డిపోతుంద‌నే భ‌యంతోనే టీఆర్ఎస్ నాట‌కం ఆడిచిందంటూ బీజేపీ ఆరోపిస్తోంది.

ఇదిలా ఉండ‌గా ఎలాంటి ఆధారాలు స‌మ‌ర్పించ‌క పోవ‌డంతో నిందితుల‌ను విడుద‌ల చేయాలంటూ సీబీఐ కోర్టు ఆదేశించ‌డం ఈ మొత్తం వ్య‌వ‌హారంలో బిగ్ ట్విస్ట్. తెలంగాణ‌లో ఖాకీలు అనుస‌రిస్తున్న తీరు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది.

సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర ఈ సంద‌ర్బంగా వెల్ల‌డించిన విష‌యాల‌కు పొంత‌న లేకుండా పోయింది. ఎంత న‌గ‌దు ప‌ట్టుప‌డింది. ఆ డ‌బ్బు ఎక్క‌డి నుంచి

వ‌చ్చింది. దాని వెనుక ఎవ‌రు ఉన్నార‌నే దాని గురించి క్లారిటీ లేకుండా పోయింది. మొద‌ట రూ. 15 కోట్ల న‌గ‌దు ప‌ట్టుబ‌డింద‌న్నారు.

అంత పెద్ద మొత్తంలో డ‌బ్బులు ఎలా వ‌చ్చాయ‌నేది తెలియాల్సి ఉంది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ప్ర‌లోభాల‌కు గురి చేసిన వారే కాకుండా

ట‌చ్ లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా విచార‌ణ‌లో భాగ‌స్వాములే. అస‌లు కోట్లాది రూపాయ‌లు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయ‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాలే ఇందుకు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. లో గుట్టు పెరుమాళ్ల‌కు ఎరుక‌. చివ‌ర‌కు ఆ దొంగ‌లు ఎవ‌రో తేల్చాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Also Read : యాద‌గిరిగుట్టలో ‘బండి’ ప్ర‌మాణం

Leave A Reply

Your Email Id will not be published!