PAK vs NED T20 World Cup : హమ్మయ్య పాకిస్తాన్ గెలిచింది
టి20 వరల్డ్ కప్ లో తొలి గెలుపు
PAK vs NED T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ -2022 మెగా టోర్నీలో సూపర్-12లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై పాకిస్తాన్(PAK vs NED T20 World Cup) విజయం సాధించింది టోర్నీలో తొలి మ్యాచ్ లో భారత జట్టు చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఇక పసికూనగా భావించిన జింబాబ్బే చేతిలో ఊహించని రీతిలో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో పరాజయం పొందింది. ఈ తరుణంలో తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో సత్తా చాటింది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే సమయంలో ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ వెంటనే రాజీనామా చేయాలని పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేశారు. ఈ తరుణంలో నెదర్లాండ్స్ పై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. తప్పక గెలవాల్సిన జట్టులో షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. పాకిస్తాన్ 13.5 ఓవర్లలో 92 పరుగుల లక్ష్యాన్ని ముగించింది.
తక్కువ రన్ రేట్ ను ఈజీగా ఛేదించడంతో సెమీస్ కు వెళ్లేందుకు ఛాన్స్ ఏర్పడుతుంది. మరోసారి ఆజమ్ ఫెయిల్ కాఆగా రిజ్వాన్ 49 పరుగులు చేసి లక్ష్యం చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
నెదర్లాండ్స్ ను ఖాన్ , వసీం జూనియర్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో 9 వికెట్లు కోల్పోయి 91 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో కొలిన్ అకెర్ మన్ 27 రన్స్ చేయడంతో ఆ మాత్రం రన్స్ చేసింది.
Also Read : టీమిండియాకు సఫారీల షాక్