Jeff Bezos Adani : జెఫ్ బెజోస్ అదానీ నువ్వా నేనా
ప్రకటించిన ఫోర్బ్స్ రిచ్ లిస్ట్
Jeff Bezos Adani : భారత దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి తన స్థానాన్ని పెంచుకున్నారు. స్టాక్ మార్కెట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తన ఆదాయం తగ్గుతూ పెరుగుతూ వస్తోంది. తాజాగా ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ లో గౌతమ్ అదానీ మళ్లీ మూడవ స్థానానికి చేరుకున్నాడు.
అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ను మళ్లీ అధిగమించాడు. దీంతో అదానీ(Jeff Bezos Adani) సంపద పెరిగింది. దీంతో ఫోర్బ్స్ ప్రకటించిన రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. భారతీయ స్టాక్స్ వరుసగా రెండు వారాల పాటు ర్యాలీ చేయడం, వాల్ స్ట్రీట్ షేర్లను అధిగమించడంతో గౌతమ్ అదానీ సంపద పెరిగింది.
దీంతో ఇప్పుడు ఫోర్బ్స్ రూపొందించిన రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో అమెజాన్ ఫౌండర్ ను అధిగమించి మళ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు. సోమవారం జరిగిన $314 మిలియన్ల పెరుగుదల గౌతమ్ అదానీ సంపద $131.9 బిలియన్లకు నెట్టి వేసింది.
ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్నుడిగా లూయిస్ విల్టన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ తర్వాత $156.5 బిలియన్ల నికర విలువతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.
భారతీయ ఈక్విటీ బెంచ్ మార్క్ లు మళ్లీ పుంజుకున్నాయి. ప్రధాన సెంట్రల్ బ్యాంక్ ల వాల్యూ పెరగడం గమనార్హం. గత గురువారం అమెజాన్ బలహీనమైన హలిడే సేల్స్ ను అంచనా వేసింది. ఫోర్బ్స్ జాబితాలో జెఫ్ బెజోస్ సంపద తగ్గడం విశేషం. ముగ్గురు బిలియనీర్ల మధ్య $30 నికర విలువ వ్యత్యాసం ఉంది.
Also Read : గౌతమ్ అదానీ భారీగా పెట్టుబడులు