Roger Binny : ఒత్తిడిలో ఆడే ఏకైక క్రికెటర్ కోహ్లీ ఒక్కడే
బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ షాకింగ్ కామెంట్స్
Roger Binny : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ రోజర్ బిన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి చెప్పాల్సిన పని లేదన్నాడు. తనంతకు తాను ప్రతిసారి నిరూపించు కోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని స్పష్టం చేశాడు బీససీఐ బాస్.
కోహ్లీ అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన క్రికెటర్. ప్రధానంగా అతడి ఆట తీరు అందరికంటే భిన్నంగా ఉంటుందన్నాడు. ఏ స్థాయిలోనూ ఓటమి ఒప్పుకోని అరుదైన క్రికెటర్ గా కితాబు ఇచ్చారు బిన్నీ(Roger Binny) . ప్రపంచ క్రికెట్ రంగంలో చాలా మంది ఆటగాళ్లు ఆడుతూ ఉండవచ్చు. కానీ కోహ్లీ లాంటి ఆటగాడిలా ఆడడం చాలా కష్టమని పేర్కొన్నాడు.
ప్రధానంగా ఒత్తిళ్లలో ఎంత గొప్ప ఆటగాళ్లైనా ఒక్కోసారి తడబడతారని కానీ విరాట్ కోహ్లీ అలాంటి వాటిని ఈజీగా తీసుకుంటాడని తెలిపాడు. ఇందుకు తాజా ఉదాహరణ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ ఓ ఉదాహరణ అని స్పష్టం చేశాడు బిన్నీ.
ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోజర్ బిన్నీ పాల్గొని ప్రసంగించారు. తాను కూడా పాకిస్తాన్ పై గెలుస్తుందని అనుకోలేదన్నాడు. కానీ అద్భుతమైన ఆట తీరుతో కోహ్లీ(Virat Kohli) ఆకట్టుకున్నాడని ఆ మ్యాచ్ కలకాలం గుర్తుంచుకునేలా చేసిందన్నాడు రోజర్ బిన్నీ.
Also Read : అరుదైన రికార్డ్ కు చేరువలో కోహ్లీ