Sriram Krishnan : ఎలాన్ మస్క్ వెనుక శ్రీరామ్ కృష్ణన్
ఎవరీ కృష్ణన్ ఏమిటా కథ వెనుక కథ
Sriram Krishnan : ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ గా నిలిచారు టెస్లా సిఇఓ , చైర్మన్ ఎలాన్ మస్క్. మొత్తం కుబేరులలో ఆయన కూడా ఒకరు. ఈ మధ్య వరుసగా ఏదో ఒక అంశంలో ఆయన పేరు ప్రస్తావించకుండా లేని పరిస్థితిని తీసుకు వచ్చారు.
ఓ వైపు విద్యుత్ కార్ల తయారీలో టాప్ లో ఉన్న సదరు వ్యాపారవేత్త ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఆయన
ఆలోచనలు రాకెట్ కంటే వేగంగా ఉంటాయి. ఎలాన్ మస్క్(Elon Musk) ను అంచనా వేయడం, అతడితో అడుగులు వేయడం చాలా కష్టం.
మూడో కంటికి కూడా తన ఫీలింగ్స్ ను బయట పడకుండా ఉంచడంలో దిట్ట. అసలైన సిసలైన వ్యాపారవేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు మస్క్.
ఇదే క్రమంలో మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను ఏకంగా రూ. 4,400 కోట్లకు కొనుగోలు చేశాడు.
మొదట డీల్ కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత స్పామ్ , ఫేక్ ఖాతాల విషయం గురించి తనకు వివరాలు కావాలని కోరాడు. కానీ ఇవ్వడంలో విఫలమైంది
నాటి మేనేజ్ మెంట్ . ఆ వెంటనే కోర్టుకు ఎక్కింది ట్విట్టర్. చివరకు తాను కోరినట్లుగానే చెల్లించాడు. ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాడు.
వచ్చీ రావడంతోనే షాకింగ్ ఇచ్చాడు. టాప్ మేనేజ్ మెంట్ పై వేటు వేశాడు. తాజాగా 25 శాతం ఉద్యోగులకు మంగళం పాడే పనిలో ఉన్నాడు. ఆపై బ్లూ టిక్ కు, పాపులర్ ట్విట్టర్ అకౌంట్లకు ఛార్జి కూడా వసూలు చేసే పనిలో ఉన్నాడు.
ఎందుకంటే తను వ్యాపారవేత్త కదా. మరి పూర్తిగా పక్కా కమర్షియల్ వ్యాపారవేత్త అయిన మస్క్ ఇంత స్పీడ్ గా ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాడని ప్రతి ఒక్కరు విస్తు పోతున్నారు. కానీ దాని వెనుక ఓ భారతీయుడు ఉన్నాడంటే నమ్మగలమా. అవును..అతడు ఎవరో కాదు తమిళనాడుకు చెందిన శ్రీరామ్ కృష్ణన్(Sriram Krishnan).
ఇప్పుడు అతడి పేరు మారుమ్రోగుతోంది. గూగుల్ లో తెగ వెతుకుతున్నారు ఎవరు ఇతడు అని. ఈ సంచలన నిర్ణయాలు, ఆకస్మిక చర్యల వెనుక మనోడి
బుర్ర ఉందనేది వాస్తవం. ఇదే విషయాన్ని తనే రాసుకు వచ్చాడు ట్విట్టర్ లో. ఎలాన్ మస్క్ కు సాయం చేస్తున్నట్లు తెలిపాడు.
ట్విట్టర్ లో ఎడిట్ బటన్ సహా ప్రస్తుతం ఉన్న పాలసీని పొడిగించడం, అకౌంట్ వెరిఫికేషన్ వంటి కీల నిర్ణయాలపై మస్క్ కు శ్రీరామ్ కృష్ణన్ సలహా
ఇచ్చినట్లు సమాచారం. ఇక కృష్ణన్ చెన్నైలో పుట్టాడు. 2001 నుంచి 2005 దాకా ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు.
మైక్రో సాఫ్ట్ లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రామ్ మేనేజర్ గా చేశాడు. మెటా, స్నాప్ చాట్ తదితర బిగ్ కంపెనీలలో పని చేశాడు. తన భార్య ఆర్తి రామ్మూర్తితో కలిసి క్లబ్ హౌజ్ టాక్ షో చేశాడు.
అప్పుడే ఎలాన్ మస్క్ తో పరిచయం జరిగింది. ఆ తర్వాత ట్విట్టర్ లో సహాయకారిగా ఉన్నాడు. రేపొద్దున పిట్ట కూతకు శ్రీరామ్ కృష్ణన్ సిఇఓగా
అయినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు.
Also Read : ట్విట్టర్ లో 25 శాతం ఉద్యోగాలకు కోత