Twitter Alternative Comment : ట్విట్టర్ కు ప్రత్యామ్నాయం లేదా
పక్కా కమర్షియల్ కానుందా
Twitter Alternative Comment : ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది సోషల్ మీడియా. ప్రధానంగా సాంకేతికంగా చోటు చేసుకున్న మార్పులతో యావత్ లోకమంతా ఒకే గదికి పరిమితం అయి పోయింది. కరోనా కంటే ముందు కరోనా వచ్చాక పరిస్థితులు మారి పోయాయి. ఈ తరుణంలో మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పు కోవాల్సి ఉంది.
ఎందుకంటే కోట్లాది మంది ఇందులో యూజర్లుగా ఉన్నారు. నిత్యం కోట్లాది మంది అభిప్రాయాలు, ఆలోచనలు, ఫోటోలు, వీడియోలు, సంఘటనలు,
వార్తలు, విశేషాలు, కన్నీళ్లు, సంతోషాలు, ఆవేశాలు, ఆగ్రహాలు, ఆందోళనలు, నిరసనలు..ఇలా ప్రతి సన్నివేశానికి ప్రతీకగా నిలిచింది ట్విట్టర్.
ఒక రకంగా చెప్పాలంటే పిట్టకూత. దీనిని ప్రారంభించిన నాటి నుంచి ఊహించని రీతిలో స్పందన లభించింది. మిగతా సంస్థలు ఎన్నో ప్రయత్నాలు
చేసినా ట్విట్టర్ ముందు నిలువలేక పోయాయి. కారణం క్రియేటివిటీకి పట్టం కట్టడం. స్వేచ్ఛకు ఆహ్వానం పలకడం..అభిప్రాయాలు, ఆలోచనలకు వేదిక కావడం వల్లే దానికి అంత పాపులారిటీ వచ్చింది.
యావత్ దేశాలను , అధిపతులను , అన్ని రంగాలకు చెందిన వారిని ప్రభావితం చేస్తూనే ఉన్నది. దీనిని ఎవరూ కాదనలేరు. కానీ అనుకోకుండా ట్విట్టర్ కు సిఇఓగా ఉన్న డోర్సీ తన పదవి నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో తనకు నమ్మకస్తుడైన ప్రవాస భారతీయుడైన పరాగ్ అగర్వాల్ కు అప్పగించాడు.
2021లో ట్విట్టర్ బోర్డు నుంచి వైదొలిగాడు. ఇదే క్రమంలో ప్రపంచ కుబేరుల్లో టాప్ త్రీలో ఉన్న టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ ఎంటర్ కావడంతో ఒక్కసారిగా ట్విట్టర్ లో కలకలం రేగింది. ప్రపంచంలో పెట్టుబడిదారులంతా ఒకే రకమైన ఆలోచనా ధోరణితో ఉంటారు.
ఒక రూపాయి ఇన్వెస్ట్ చేస్తే తమకు 10 రూపాయలు ఎలా లాభం వస్తాయనే దానిపైనే ఫోకస్ పెడతారు. ఈ తరుణంలో డీల్ కుదర్చుకున్నాడు. మొదట
ఓకే చెప్పినా ఆ తర్వాత డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో ట్విట్టర్ కోర్టుకు ఎక్కింది. నష్ట పరిహారం ఇవ్వాలని కోరింది.
చివరకు ట్విట్టర్ తో ఒప్పందం చేసుకున్న విధంగానే రూ. 4,400 కోట్లకు ఓకే చేశాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చాడు. మొత్తం టాప్ లెవల్లో ఉన్న
వారందరినీ తొలగిస్తూ పోయాడు. తక్కువ మంది ఉద్యోగులతో ట్విట్టర్ ను నడిపించాలని చూస్తున్నాడు. అంతే కాదు మరిన్ని సేవలు పొందాలంటే ఇక ఫీజులు చెల్లించే విధంగా ప్లాన్ చేస్తున్నాడు.
మొత్తంగా ఎలాన్ మస్క్ రాకతో ట్విట్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాని భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో డార్సీ
ప్రత్యామ్నాయంగా బ్లూస్కీని తయారు చేస్తున్నట్లు సమాచారం. మరో వైపు ప్రత్యామ్నాయం కోసం భారత్ లో కూ-ను తీసుకు వచ్చారు.
దానికి కూడా భారీ ఎత్తున జనాదరణ ఉన్నా ట్విట్టర్ తో(Twitter Alternative) పోటీ పడలేక పోయింది. మరి ట్విట్టర్ సక్సెస్ లో పాలు పంచుకున్న
వారంతా మరో దానిని తీసుకు వస్తారా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా ట్విట్టర్ ఓ సంచలనం. భావోద్వేగాల సమ్మేళనం.
దానిని ఎవరూ కాదనలేరు. వద్దనలేరు. ఎందుకంటే అది ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది..ఆలోచనలకు ప్రాణం పోస్తుంది..జీవితాలను ప్రతిఫలించేలా చేస్తుంది. పరాగ్..డార్సే..శ్రీరామ్ కృష్ణన్ లాంటి వాళ్లు ఏమైనా కొత్తగా ఆలోచిస్తే బెటర్. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుకుందాం.
Also Read : బ్లూ టిక్ పొందాలంటే $20 చెల్లించాలా