Jamshed J Irani : వ్యాపారవేత్త జంషెడ్ ఇరానీ ఇకలేరు
స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు
Jamshed J Irani : దిగ్గజ వ్యాపారవేత్తలలో ఒకరుగా స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా వినుతి కెక్కిన జెంషడ్ ఇరానీ(Jamshed J Irani) కన్ను మూశారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. జంషెడ్ పూర్ లోని టాటా మెయిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జంషెడ్ ఇరానీకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన లేరన్న వార్తతో వ్యాపార రంగంలో విషాదం అలుముకుంది.
ముఖ్యంగా స్టీల్ (ఇనుము) రంగంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. ఆయన ముద్రను కాదనలేం. జంషెడ్ ఇరానీ మృతిపై టాటా స్టీల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా 2011లో జంషెడ్ ఇరానీ టాటా స్టీల్ బోర్డు నుంచి తప్పుకున్నారు. గత 40 సంవత్సరాలుగా వ్యాపార పరంగా విశిష్టమైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
జంషెడ్ ఇరానీ 1963లో సీనియర్ సైంటిఫిక్ అధికారిగా తన కెరీర్ స్టార్ట్ చేశాడు. 1968లో భారత దేశానికి వచ్చాడు. టాటా స్టీల్ లో అసిస్టెంట్ గా, 1979లో జీఎంగా , 1985 సంవత్సరంలో ప్రెసిడెంట్ గా నియమిస్తారు. 1992లో ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 2001 జూలై దాకా తన సేవలు అందించారు జంషెడ్ ఇరానీ.
భారత దేశ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం గా భావించే పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. తనను తాను గౌరవించుకుంది. జార్ఖండ్ సీఎంతో పాటు పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు జంషెడ్ వర్మ మృతిపై. ఆయన సమర్థవంతమైన వ్యాపారవేత్తనే కాదు నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అంటూ ప్రశంసించారు.
Also Read : 14న మోర్బీ వంతెన ప్రమాదంపై విచారణ