Kohli Fake Fielding : కోహ్లీపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఫైర్
ఫేక్ ఫీల్డింగ్ అంటూ ఐసీసీకి ఫిర్యాదు
Kohli Fake Fielding : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అంపైర్ల నిర్ణయాలపై పలు జట్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఐసీసీ ముగ్గురిని ప్రతి మ్యాచ్ కు ఏర్పాటు చేసింది. కీలకమైన లీగ్ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగింది. ప్రధానంగా విరాట్ కోహ్లీ చేసిన ఫీల్డింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కోహ్లీని టార్గెట్ చేస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ మేనేజ్ మెంట్ తో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సీరియస్ గా స్పందించింది. ఈ మేరకు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. బంగ్లా టైగర్స్ వికెట్ కీటర్ బ్యాటర్ నూరుల్ హసన్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఫేక్ ఫీల్డింగ్(Kohli Fake Fielding) అని ఆరోపించడంతో భారీ వివాదానికి దారితీసింది.
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా వర్షం అంతరాయం కలిగించిన తర్వాత ఆటను తిరిగి ప్రారంభించే ముందు అంపైర్లతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వివాదాస్పద అంపైరింగ్ విషయాన్ని సరైన ఫోరమ్ లో లేవనెత్తాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ గురువారం స్పందించాడు.
షకీబ్ కూడా ఫేక్ ఫీల్డింగ్ విషయం గురించి అంపైర్లతో చర్చించినట్లు తెలిపాడు. ఆందోళన తగ్గినట్లు భావిస్తున్నట్లు తెలిపాడు. జరిగిందంతా టీవీలో చూశారు. ఫేక్ త్రో గురించి ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు.
ఈ వివాదం ప్రస్తుతం క్రికెట్ వర్గాలలో కలకలం రేపుతోంది.
Also Read : కోహ్లీ..జెమిమా..దీప్తి శర్మ నామినేట్