PAK vs SA T20 World Cup : దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ విక్టరీ
33 రన్స్ తో గెలుపు..సెమీస్ ఛాన్స్
PAK vs SA T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ -2022 సూపర్ -12 గ్రూప్ -బి లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది పాకిస్తాన్(PAK vs SA T20 World Cup) . డూ ఆర్ డై గా సాగిన ఈ మ్యాచ్ లో సెమీ ఫైనల్ కు వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. 33 పరుగుల తేడాతో బలమైన సౌతాఫ్రికాను ఓడించింది.
ఇప్పటికే భారత్, జింబాబ్వేతో ఓటమి పాలైంది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో గెలుపొందితేనే సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. మరో వైపు ఇదే గ్రూప్ లో కొనసాగుతోంది టీమిండియా. దాయాది దేశాలు ఒకే గ్రూప్ లో ఉండడం విశేషం. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పాకిస్తాన్ విక్టరీ సాధించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 రన్స్ చేసింది. భారీ టార్గెట్ ను ముందుంచింది దక్షిణాఫ్రికా ముందు. ఇదిలా ఉండగా మైదానంలోకి దిగిన సఫారీలకు కోలుకోలేని షాక్ తగిలింది. వర్షం రావడంతో మ్యాచ్ ను 14 ఓవర్లకు కుదించారు అంపైర్లు.
మొత్తం టార్గెట్ ను 142 రన్స్ గా నిర్ణయించారు. టార్గెట్ ఛేదనంలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 14 ఓవర్లలో కేవలం 108 పరుగులు చేసింది. ఏకంగా 9 వికెట్లు కోల్పోయింది. తాజా విజయంతో పాకిస్తాన్ జట్టు మూడో స్థానంలో నిలిచింది.
ఇక ఇప్పటికే భారత జట్టు మొదటి స్థానంలో ఉండగా సఫారీ జట్టు రెండవ స్థానంలో కొనసాగుతోంది. మరో వైపు టోర్నీలో సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకుంది పాకిస్తాన్.
Also Read : కోహ్లీ..జెమిమా..దీప్తి శర్మ నామినేట్