Imran Khan Comment : ఎంత కాలం ఈ హింసోన్మాదం

ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఇమ్రాన్ ఖాన్

Imran Khan Comment : మ‌రోసారి పాకిస్తాన్ ఉలిక్కి ప‌డింది మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పై కాల్పుల దాడి ఘ‌ట‌న‌తో. భార‌త్ నుంచి విడి పోయిన త‌ర్వాత గిల్లిక‌జ్జాలు పెట్టుకోవ‌డంలో ముందంజ‌లో ఉంది. ఉగ్ర‌వాదానికి కేరాఫ్ గా మారింది పాకిస్తాన్. ఎవ‌రు ప్ర‌ధానిగా ఉన్నా లేదా అధ్య‌క్షుడిగా ఎన్నికైనా వారి చేతుల్లో ప‌వ‌ర్స్ అంటూ ఉండ‌వు.

అక్క‌డ పేరుకు మాత్ర‌మే ప‌ద‌వులు. పాల‌న అంతా ఆ దేశానికి చెందిన ఆర్మీ చేతుల్లో ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ లోని గుజ్ర‌న్ వాలాలో పీటీఐ పార్టీ

నిర్వ‌హించిన లాంగ్ మార్చ్ లో మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఇమ్రాన్ ఖాన్ కుడి కాలుకు గాయ‌మైంది.

ఆయ‌న‌తో పాటు త‌న పార్టీకి చెందిన న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మాజీ పీఎం ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారు. పాకిస్తాన్ లో అత్య‌ధిక శాతం

ఉగ్ర‌వాదంతో, తుపాకుల‌తో స‌హ‌వాసం చేస్తున్నారు. మొన్న‌టికి మొన్న ప్ర‌కృతి క‌న్నెర్ర చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశ పాల‌కుల‌కు బుద్ది రాలేదు.

తుపాకితో రాజ్యాన్ని న‌డ‌పాల‌ని అనుకున్న వారంతా చ‌రిత్ర‌లో క‌నుమ‌రుగు లేకుండా పోయారు. ఇప్ప‌టికే పాకిస్తాన్ చ‌రిత్ర అంతా ర‌క్త‌త‌ర్ప‌ణంతో కూడుకుని ఉన్న‌దే. మాజీ ప్ర‌ధాన మంత్రి బేన‌జిర్ భుట్టోను పొట్ట‌న పెట్టుకున్నారు. అంత‌కు ముందు ఆమె తండ్రిని ఉరి తీశారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘ‌ట‌న‌లు. ఆ దేశ చ‌రిత్ర అంతా ఏ పేజీ తిరిగేసినా క‌న్నీళ్లు..ర‌క్త‌పు మ‌ర‌క‌లే ద‌ర్శ‌నం ఇస్తాయి. తాజాగా ఆనాటి బేన‌జీర్

ఘ‌ట‌న‌ను ఇవాళ చోటు చేసుకున్న ఇమ్రాన్ పై జ‌రిగిన దాడి గుర్తుకు తెచ్చింది.

పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ గా ఆ దేశానికి వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకు వ‌చ్చిన నాయ‌కుడిగా ఇమ్రాన్ ఖాన్(Imran Khan) కు వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫాలోయింగ్ ఉంది.

ఆ త‌ర్వాత ఆయ‌న అనుకోకుండా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అవినీతిని అంతం చేస్తా..నీతివంత‌మైన పాల‌న అంద‌జేస్తానంటూ ప్ర‌చారం చేశారు. జ‌నం

న‌మ్మారు. బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. పాల‌నా ప‌గ్గాలు అప్ప‌గించారు. రాను రాను ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. చివ‌ర‌కు దేశ చ‌రిత్ర‌లో

అవిశ్వాస తీర్మానం ద్వారా తొల‌గించ‌బ‌డ్డారు.

ఈ క్ర‌మంలో ఇమ్రాన్ ఖాన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌ను తొల‌గించ‌డంలో కీల‌క‌మైన పాత్ర అమెరికా పోషించిందంటూ మండిప‌డ్డారు. ఇదే

స‌మ‌యంలో అంద‌రు ప్ర‌ధానులు ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లుగానే ఇమ్రాన్ ఖాన్ కూడా భార‌త్ పై ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చారు.

చివ‌ర‌కు అంత‌ర్జాతీయ స‌మావేశాల్లో కూడా విమ‌ర్శ‌లు చేశారు. త‌నంత‌కు తాను పీఎంగా వైదొలిగాక భార‌త్ విదేశాంగ విధానాన్ని, ప్ర‌ధాని మోదీపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ వ‌చ్చారు.

ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి పాకిస్తాన్ లో . తాను మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకి వెళ‌తాన‌ని, త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని, కేవ‌లం ర‌ష్యాతో స్నేహం చేయ‌డం వ‌ల్ల‌నే అమెరికా క‌క్ష క‌ట్టిందంటూ వాపోయారు.

ఏది ఏమైనా ఇమ్రాన్ ఖాన్ త‌ల‌వంచ‌ని మ‌న‌స్త‌త్వం. విచిత్రం ఏమిటంటే క్రికెట్ లో విజేత‌గా నిలిచన ఇమ్రాన్ ఖాన్ పాలిటిక్స్ లో స‌క్సెస్ కాలేక పోయారు

అని చెప్ప‌క త‌ప్ప‌దు. తూటాల వ‌ల్ల ప్రాణాలు పోవ‌డం త‌ప్ప దేశం బాగుప‌డ‌ద‌ని తెలుసు కోవాలి. ఎవ‌రు హింస‌ను న‌మ్ముకుంటారో ఆ హింసోన్మాదానికి బ‌ల‌వుతార‌ని తెల‌సు కోవాలి.

Also Read : ర్యాలీలో కాల్పులు ఇమ్రాన్ ఖాన్ కు గాయాలు

Leave A Reply

Your Email Id will not be published!