Wasim Akram : ఇమ్రాన్ భాయ్ త్వరగా కోలుకోవాలి – వసీం
గ్రేట్ లీడర్ గ్రేట్ కెప్టెన్ అంటూ కితాబు
Wasim Akram : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు తనతో పాటు కలిసి క్రికెట్ మ్యాచ్ లు ఆడిన స్టార్ మాజీ పేసర్ వసీం అక్రమ్(Wasim Akram). ఆయనతో పాటు వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానమంత్రులు, ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరారు.
మరో వైపు భారత దేశం కూడా స్పందించింది. పాకిస్తాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పాకిస్తాన్ లోని వజీరాబాద్ లో మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో పాల్గొన్న సమయంలో ఫైజల్ భట్ అనే సాయుధుడు కాల్పులకు పాల్పడ్డాడు.
ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కుడి కాలులోకి బుల్లెట్ దూసుకు పోయింది. పీటీఐకి చెందిన నలుగురు నేతలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయం నుంచి బతికి బయట పడ్డారు ఇమ్రాన్ ఖాన్. ఇదిలా ఉండగా పాకిస్తాన్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ కు(Wasim Akram) ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఆయన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆయన సారథ్యంలో మొదటిసారిగా 1992లో వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ జట్టులో వసీం అక్రమ్ కూడా ఉన్నాడు. ఇలాంటి ఘటనలు పునావృతం కాకూడదు. ఇమ్రాన్ భాయ్ నువ్వు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
Also Read : నాపై దాడికి ఆ ముగ్గురే కారణం – ఇమ్రాన్ ఖాన్