Isudan Gadhvi : నిన్న టీవీ జర్నలిస్ట్ నేడు సీఎం అభ్యర్థి
ఎవరీ సువిధన్ గాధ్వీ ఏమిటా కథ
Isudan Gadhvi : గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడంతో ఎవరీ సువిధన్ గాధ్వీ అన్నది వెతకడం ప్రారంభమైంది. ఆప్ లో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. అంతకు ముందు గాధ్వీ మీడియా ప్రొఫెషనల్ గా పేరొందారు.
ప్రస్తుతం ఆప్ కు జాయింట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. జాతీయ పార్టీ కార్యవర్గ సభ్యుడు. టీవీ జర్నలిస్ట్ గా , వీటీవీ న్యూస్ ఎడిటర్ గా పని చేశారు. అంతే కాదు మహామంథన్ కి యాంకర్ గా పేరొందాడు. ఆప్ లో చేరిన తర్వాత రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు.
ఇసుదాన్ 1982 జనవరి 10న గుజరాత్ లోని దేవభూమి ద్వారా జిల్లాలోని జంఖంభాలియా పట్టణం సమీపంలోని పిపాలియా ఊరులో పుట్టాడు. అతని తండ్రి వృత్తి రీత్యా రైతు. 2005లో గుజరాత్ విద్యా పీఠ్ నుండి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ చేశాడు. దూరదర్శన్ లో షో యోజనలో పని చేశాడు.
2007 నుండి 2011 దాకా ఈటీవీ గుజరాత్ పోర్ బందర్ లో ఆన్ ఫీల్డ్ జర్నలిస్ట్ గా పని చేశాడు. తన వార్తా కార్యక్రమంలో గుజరాత్ లోని డాంగ్ , కపరాడ తాలూకాలలో రూ. 150 కోట్ల అక్రమ అటవీ నిర్మూలన స్కాంను బయట పెట్టాడు. గాధ్వీ దెబ్బకు గుజరాత్ సర్కార్ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
ఈ సంఘటన గాధ్వీకి దేశ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చేలా చేసింది. 2015లో అతి చిన్న వయసులో వీటీవీకి ఛానల్ హెడ్ గా పని చేశాడు. 2021 వరకు 5 ఏళ్ల పాటు పని చేశాడు. మహా మంథన్ అనే పేరుతో టాప్ ప్రైమ్ టీవీ షోను చేపట్టాడు.
ప్రజలతో ఫోన్ ఇన్ చేపట్టిన కార్యక్రమం పాపులర్ అయ్యింది. ఇదే ఏడాదిలో మీడియాను వదిలి పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. రాష్ట్రంలో నూతన మార్పు కోసం తాను పార్టీలో చేరినట్లు ప్రకటించాడు గాధ్వీ(Isudan Gadhvi) .
మీడియా ద్వారా కొద్ది మందికి మాత్రమే సేవ చేశాను. కానీ పాలిటిక్స్ లోకి వస్తే రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. మొత్తంగా గాధ్వీ ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.
Also Read : ఆప్ గుజరాత్ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్ గాధ్వీ