Congress Deposit Loss : మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
సత్తా చాటిన టీఆర్ఎస్ ..చేతులెత్తేసిన బీజేపీ
Congress Deposit Loss : తెలంగాణలో పూర్వ వైభవాన్ని తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్న సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వాస్తవానికి మునుగోడు నియోకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే సీటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది. ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తన పదవికి రాజీనామా చేశారు.
అత్యుత్సాహంతో భారతీయ జనతా పార్టీలో చేరారు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా చీలుతుందని , తన వ్యక్తిగత చరిష్మాతో పాటు జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీకి ఉన్న బలం కలిసి వస్తుందని ఆశించారు. కానీ వ్యూహాలు పన్నడంలో, ప్రత్యర్థులను దెబ్బ కొట్టడంలో ఆరితేరిన నాయకుడిగా పేరొందని కేసీఆర్ ముందు పని చేయలేక పోయాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయాన్ని నమోదు చేశారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ప్రగతి భవన్ లో సంబురాలు కూడా మొదలయ్యాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న పాల్వాయి స్రవంతి రెడ్డికి(Congress Deposit Loss) ఆశించిన మేర ఓట్లు రాలేదు. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.
ఇది పార్టీ అభ్యర్థి కంటే పార్టీకి పెద్ద దెబ్బగా భావించవచ్చు. స్రవంతి రెడ్డి ఉదయం 10 గంటలకే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లి పోయింది. ఇక మొత్తం 2,41,805 ఓట్లకు గాను 2,25,192 ఓట్లు పోల్ అయ్యాయి. కనీసం 37,532 ఓట్లు రావాల్సి ఉండగా అవేవి రాలేదు. దీంతో డిపాజిట్ దక్కలేదు.
ఒక రకంగా పాల్వాయి స్రవంతి రెడ్డికి పార్టీ పరంగా సపోర్ట్ దొరకలేదు. ఆమె స్వంతంగా సంపాదించుకున్న ఓట్లుగా భావించవచ్చు.
Also Read : ఇది అధర్మ విజయం – కోమటిరెడ్డి