Munugodu TRS Win Comment : గులాబీ ద‌ళ‌పతిదే హ‌వా

ఓడిన ప్ర‌జ‌లు గెలిచిన కోట్లు

Munugodu TRS Win Comment : మునుగోడు హోరు ముగిసింది. నిన్న‌టి దాకా ఊరిస్తూ వ‌చ్చిన ఉప ఎన్నిక ఎట్ట‌కేల‌కు పూర్త‌యింది. ఈ ఎన్నిక కోరి కొని తెచ్చుకున్న‌ది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ‌గోపాల్ రెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి గుడ్ బై చెప్పారు. ఆపై బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ త‌రుణంలో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారి పోయాయి.

ఒక ర‌కంగా చెప్పాలంటే ర‌ష్యా, ఉక్రెయిన్ వార్ ను కూడా మ‌రిపించేసింది ఈ బై పోల్. అధికార పార్టీ ఈ ఉప ఎన్నిక‌ను రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు

సైమీ ఫైన‌ల్ గా భావించింది. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. అటు కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ కూడా సీరియ‌స్ గా తీసుకుంది.

కోల్పోయిన ప్రాభ‌వాన్ని తిరిగి తెచ్చుకునే ప్ర‌య‌త్నంలో మునిగి పోయిన కాంగ్రెస్ పార్టీకి ఒక ర‌కంగా కోలుకోలేని దెబ్బ‌. ఈ త‌రుణంలో బ‌రిలో ఎంతో

మంది ఉన్నా ప్ర‌ధానంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే కొన‌సాగింది. కానీ ఊహించ‌ని రీతిలో మునుగోడులో గులాబీ(Munugodu TRS Win) స‌త్తా చాటింది.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఓటు ఉంద‌ని అంతా భావించారు. కానీ అది క‌నిపించ నీయ‌కుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యింది టీఆర్ఎస్ పార్టీ. ఓ వైపు దేశ

రాజ‌కీయాల‌లో చ‌క్రం తిప్పాల‌ని డిసైడ్ అయిన సీఎం కేసీఆర్ త‌న స‌ర్వ శ‌క్తుల‌ను మ‌రోసారి ప్ర‌యోగించారు. బ‌ల‌మైన , దేశ వ్యాప్తంగా ఆక్టోప‌స్ లా అల్లుకు పోయిన భార‌తీయ జ‌న‌తా పార్టీని ఎదుర్కొనేందుకు వ్యూహాలు ర‌చించాడు.

మొత్తం అధికార యంత్రాంగాన్ని మోహ‌రించాడు. ఆపై త‌న మంత్రివ‌ర్గం మొత్తం మునుగోడును జ‌ల్లెడ ప‌ట్టేలా చేశాడు. ఈ మొత్తం ఉప ఎన్నిక ఎపిసోడ్

అంతా పార్టీ అభ్య‌ర్థుల కంటే ప్ర‌ధానంగా సీఎం కేసీఆర్ , హొం మంత్రి అమిత్ షా మ‌ధ్య పోటీగా నెల‌కొనేలా చేసింది.

దేశంలోని ఆరు రాష్ట్రాల‌లో 7 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఉప ఎన్నిక జ‌రిగితే ఒక్క మునుగోడుపైనే ఫోక‌స్ పెట్టింది.

ఇదే స‌మ‌యంలో దాడులు, ఆరోప‌ణ‌లు, కేసులు, లెక్క‌లేనంత నోట్ల క‌ట్ట‌లు, ఎప్పుడూ లేనంత మ‌ద్యం, బ‌హుమానాలు, తాయిలాలు, ప్ర‌లోభాలు అన్నీఇక్క‌డ ప‌ని చేశాయి. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఏం చేస్తుంద‌నే దానిపై కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

మొత్తం మీద బీజేపీ , టీఆర్ఎస్ మ‌ధ్య నువ్వా నేనా అన్న పోటీ సాగినా చివ‌ర‌కు గులాబీ ద‌ళ‌ప‌తి కొట్టిన దెబ్బ‌కు భారీ విజ‌యాన్ని సాధించింది. 100

కిలోమీట‌ర్ల కు పైగా దూసుకు పోయింది కారు గుర్తు. అక్క‌డ అభ్య‌ర్థి కంటే కేసీఆర్ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. ఈ విష‌యంలో బీజేపీ కూడా శాయశ‌క్తులా పోరాడింది.

కానీ ఇక్క‌డ పార్టీ కంటే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి ఉన్న చ‌రిష్మా ఎక్కువ‌గా ప‌ని చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా కేసీఆర్(CM KCR) మ‌రోసారి త‌న‌ను తాను బిగ్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ న‌ని నిరూపించుకున్నారు. రాబోయే ఎన్నిక‌ల‌కు ఒక బూస్ట్ గా ప‌ని చేస్తుంద‌ని తప్ప‌దు.

Also Read : ఆ మంత్రుల‌కు ఓట‌ర్లు ఝ‌ల‌క్

Leave A Reply

Your Email Id will not be published!