Aditya Thackeray : త్వరలో షిండే సర్కార్ కూలడం ఖాయం
శివసేన అగ్ర నేత ఆదిత్యా ఠాక్రే కామెంట్స్
Aditya Thackeray : శివసేన అగ్ర నాయకుడు, మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే(Aditya Thackeray) సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే మరాఠాలో కొలువు తీరిన శివసేనను చీల్చి భారతీయ జనతా పార్టీతో జత కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం ఏక్ నాథ్ షిండే సర్కార్ కూలి పోవడం ఖాయమన్నారు.
సోమవారం ఆదిత్యా ఠాక్రే మీడియాతో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. షిండే, ఫడ్నవీస్ ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని, ఈ అపవిత్ర కలయిక పూర్తిగా తొలగి పోవడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని ఆరోపించారు.
ఎవరు సీఎం అన్నది తెలియడం లేదన్నారు ఆదిత్యా ఠాక్రే. త్వరలోనే షిండే, బీజేపీ సర్కార్ కూలి పోవడం కచ్చితమేనని పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికలకు శివసేన ( బాల్ ఠాక్రే పార్టీ ) నాయకులు, శ్రేణులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఇవాళ అకోలా జిల్లాలో జరిగిన శివసేన భారీ ర్యాలీని ఉద్దేశించి మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే ప్రసంగించారు.
రాష్ట్రానికి రావాల్సిన భారీ ప్రాజెక్టులన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. కేంద్రం కావాలని మరాఠా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు ఆదిత్యా ఠాక్రే. ద్రోహం తలపెట్టిన ప్రభుత్వం త్వరలో కూలి పోతుంది.
మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం. ఇందుకు మనమంతా సిద్దమై ఉండాలని పిలుపునిచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు ఆదిత్యా ఠాక్రే.
ఇదిలా ఉండగా మరాఠాలో ఠాక్రే చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Also Read : సుప్రీంకోర్టు తీర్పు ఆమోద యోగ్యం కాదు