Kerala Governor : కైరాలీ..మీడియా వన్ ఛానళ్లపై నిషేధం – ఖాన్
వాటి వెనుక రాజకీయ సంస్థలు దాగి ఉన్నాయి
Kerala Governor : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి గవర్నర్ కు పడడం లేదు. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది పోరు. ఈ తరుణంలో సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా రెండు మీడియా ఛానళ్లపై భగ్గుమన్నారు.
ఆపై వాటిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. కేరళకు చెందిన కైరాలీ న్యూస్ , మీడియా వన్ ఛానళ్లకు చెందిన జర్నలిస్టులను తాను మాట్లాడుతుండగా వెళ్లి పోవాలని ఆదేశించారు. తనపై వ్యక్తిగతంగా ఆ రెండు ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయంటూ ఆరోపించారు ఖాన్. ఆ జర్నలిస్టులతో మాట్లాడేందుకు గవర్నర్ నిరాకరించారు.
ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సోమవారం కొచ్చిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తన ప్రెస్ మీట్ ను కవర్ చేయకుండా కైరాలీ న్యూస్ , మీడియా వన్ మలయాళ వార్తా ఛానెళ్లను నిషేధించారు. సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్(Kerala Governor).
నేను మీడియాను ముఖ్యమైనదిగా భావించాను. వాళ్లు ఏది అడిగినా, ఎన్ని ప్రశ్నలు వేసినా సావధానంగా సమాధానం చెప్పాను. కానీ ఇప్పుడు నన్ను ఓ పార్టీకి, మరో సంస్థకు ముడి పెట్టి ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు గవర్నర్. వాళ్లు మీడియా పేరు పెట్టుకున్న రాజకీయ సంస్థలంటూ సంచలన ఆరోపణలు చేశారు.
నేను కైరాలీ, మీడియా వన్ తో మాట్లాడ దల్చు కోలేదన్నారు ఆరిఫ్ మహ్మద్ ఖాన్. తనను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నాయంటూ మండిపడ్డారు గవర్నర్.
Also Read : సుప్రీంకోర్టు తీర్పు ఆమోద యోగ్యం కాదు