Satish Jarki holi : సతీష్ జార్కి హోళి కామెంట్స్ కలకలం
నేను అన్నదాంట్లో తప్పేమీ లేదు
Satish Jarki holi : కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు సతీష్ జార్కి హోళి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దీనిపై ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తప్పు పట్టగా కాంగ్రెస్ పార్టీ స్పందించ లేదు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంది.
హిందూ అనే పదం గురించి అనేక పర్షియన్ మూలాల్లోంచి వచ్చిందంటూ అనేక పుస్తకాలలో ప్రస్తావించారని స్పష్టం చేశారు జార్కి హోలీ. ఆ పదానికి సంబంధించిన మూలంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. మంగళవారం సతీష్ జార్కి హోలీ(Satish Jarki holi) మీడియాతో మాట్లాడారు.
నేను చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఈ పర్షియన్ పదం ఎలా వచ్చిందనే దానిపై వందలాది రికార్డులు నమోదు అయి ఉన్నాయని పేర్కొన్నారు.
స్వామి దయానంద సరస్వతి రాసిన పుస్తకం సత్యార్థ ప్రకాశ్ , డాక్టర్ జీఎస్ పాటిల్ పుస్తకం బసవ భారత , బాల గంగాధర తిలక్ పుస్తకంలో దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని స్పష్టం చేశారు హోలి. ఇలాంటి కథనాలు చాలా ఉన్నాయని దయచేసి వాటిని చదివితే అసలు విషయం బోధ పడుతుందన్నారు.
జార్కి హొళి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. గతంలో జనతాదళ్ సెక్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. బెళగావి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
హిందూ అనే పదం పర్షియన్ , ఇరాన్ , ఇరాక్ , ఉజ్బెకిస్తాన్ , కజకిస్తాన్ ప్రాంతానికి చెందిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : కైరాలీ..మీడియా వన్ ఛానళ్లపై నిషేధం