Gyan Vapi Case : జ్ఞాన్ వాపి కేసు విచారణపై ఉత్కంఠ
తీర్పు వెలువరించనున్న కోర్టు
Gyan Vapi Case : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన యూపీలోని వారణాసి జ్ఞాన్ వాపి కేసు(Gyan Vapi Case) విచారణపై ఉత్కంఠ నెలకొంది. మసీదు ప్రాంగణంలో శివలింగం కనిపించిందని, తమకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఐదుగురు హిందూ మహిళలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై అటు హిందువులు ఇటు ముస్లిం వర్గాలు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
చివరకు సుప్రీంకోర్టు కూడా ఇది సున్నితమైన అంశమని, తమకంటే బాగా స్థానిక కోర్టుకే బాగా తెలుస్తుందంటూ వ్యాఖ్యానించింది. ఆపై కేసును తిరిగి యూపీ వారణాసి కోర్టుకు బదిలీ చేసింది. దీనిపై గత కొంత కాలంగా వాదోపవాదాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో విశ్వ వైదిక్ సనాతన్ సంఘ్ పిటిషన్ దాఖలు చేసింది.
హిందువులకు మసీదులోని ప్రాంగణాన్ని అప్పగించాలని కోరింది దావాలో. ఇది వారణాసి లోని కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉంది. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ మసీదు దశాబ్దాల నాటి న్యాయ వివాదానికి కేంద్రంగా ఉంది.
మసీదు బయటి గోడలపై ఉన్న హిందూ విగ్రహాలు, ఇతర పాత ఆలయ సముదాయంలో కనిపించే దేవతలకు పూజలు చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోర్టుకు ఎక్కారు. కాగా ప్రతి ఏటా కేవలం ఒకే ఒక్కసారి ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇవ్వబడుతుంది. దీనిని ప్రతి రోజూ తాము దర్శించుకునేలా, పూజలు చేసేలా పర్మిషన్ ఇవ్వాలని కోరడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది.
కోర్టు ఆదేశించిన వీడియోగ్రఫీ సర్వేలో మసీదు ప్రాంగణంలో శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు తెలిపారు. మరో వైపు మసీదు కమిట దావాను తిరస్కరించింది.
Also Read : పతంజలి బాబాకు కోలుకోలేని షాక్