Krishna SPB : ఎస్పీబీని ప్రోత్సహించిన సూపర్ స్టార్
విభేదించినా మన్నించిన కృష్ణ
Krishna SPB : తెలుగు సినిమా రంగంలో ఇద్దరూ ఉద్దండులే. ఒకరు గాన గంధర్వుడు పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం (ఎస్పీబీ) మరొకరు సూపర్ స్టార్ ఘట్టమనేని శివరామ కృష్ణ. తొలి నాళ్లల్లో ఘంటసాల వెంకటేశ్వర్ రావు ప్రభావం ఉన్న కాలంలో కృష్ణ ఎస్పీ బాలును(Krishna SPB) ప్రోత్సహించారు.
ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. విజయవంతమైన సినిమాలకు తన గొంతుకను ఇచ్చారు ఎస్పీబీ. కానీ ఎందుకనో ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. ఎస్పీబీని పక్కన పెట్టారు. రాజ్ సీతారాంను తీసుకు వచ్చారు సూపర్ కృష్ణ. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పోయారు.
కరోనా కారణంగా ఎస్పీబీ కన్ను మూశారు. ఈ సందర్బంగా కృష్ణ కన్నీటి పర్యంతం అయ్యారు. బాలు మన మధ్య లేక పోవడం బాధా కరమంటూ వాపోయాడు. ఇద్దరూ స్నేహశీలురు. ఒకరు గాన గంధర్వుడు మరొకరు అసాధ్యుడు. బాలు కెరీర్ లో తొలి నాళ్లలో అందరు నటులు ఘంటసాలను కోరుకుంటే కృష్ణ మాత్రం లేత గొంతుక కలిగిన ఎస్పీబీని ప్రోత్సహించారు.
నీ భవిష్యత్తు గురించి చింతించ వద్దంటూ భరోసా ఇచ్చారు సూపర్ స్టార్. సంవత్సరంలో నాలుగు సినిమాలు నిర్మిస్తానని.. అన్ని పాటలు నీతో పాడిస్తానంటూ హామీ ఇచ్చాడు కృష్ణ. కృష్ణ, ఎస్పీబీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బిగ్ హిట్ గా నిలిచాయి.
ప్రతి హీరో , హాస్య నటుల వాయిస్ ని స్వీకరించే నేర్పు ఎస్పీబీకి ఉంది. తన రెమ్యునరేషన్ పై బాలు మాట్లాడిన మాటలు విన్న కృష్ణ నొచ్చుకున్నారు. ఇద్దరి మధ్య అగాధం ఏర్పడింది. బాలును కాకుండా రాజ్ సీతారాంను పాడించాడు.
చివరకు వేటూరి సుందర రామ్మూర్తి, మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్ కోటి జోక్యంతో కృష్ణ, ఎస్పీబీ ఒక్కటయ్యారు. ఆ తర్వాత మళ్లీ పాడటం మొదలు పెట్టారు.
Also Read : నిర్మాతల హీరో సూపర్ స్టార్ కృష్ణ