CM KCR Krishna : కృష్ణ మ‌ర‌ణం వెండి తెర‌కు తీర‌ని లోటు

తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన సీఎం కేసీఆర్

CM KCR Krishna : సూప‌ర్ స్టార్ ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ కృష్ణ మ‌ర‌ణంపై తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్. మంగ‌ళ‌వారం ఉద‌యం 4.15 గంట‌ల‌కు క‌న్ను మూయ‌డంతో తీవ్ర దిగ్భ్రాంతిని, సానుభూతిని వ్య‌క్తం చేశారు. క‌ళామ‌త‌ల్లికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు.

న‌టుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాణ సంస్థ‌గా ఐదు ద‌శాబ్దాలుగా కృష్ణ అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు కేసీఆర్. 350కి పైగా సినిమాలు న‌టించడం మామూలు విష‌యం కాద‌న్నారు సీఎం. విభిన్న కుటుంబ క‌థా చిత్రాల‌తో పాటు ప్ర‌జ‌ల్లో సామాజిక స్పృహ క‌లిగిన న‌టుడిగా గుర్తిండి పోతార‌ని ప్ర‌శంసించారు సీఎం(CM KCR Krishna).

సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌ర‌ణంతో తెలుగు సినిమా ఒక్క‌సారిగా శోక సంద్రంలో మునిగి పోయింది. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ప్ర‌ముఖ న‌టులు మెగాస్టార్ చిరంజీవి, ముర‌ళీ మోహ‌న్ , బ్ర‌హ్మానందం సూప‌ర్ స్టార్ కృష్ణ లేక పోవ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు.

ఆయ‌న సినిమా రంగానికి అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. ఇదిలా ఉండ‌గా గుంటూరు జిల్లా తెనాలి మండ‌లం బుర్రిపాలెం స్వ‌స్థ‌లం. 57 ఏళ్ల పాటు సినీ రంగంలో ఉన్నారు. 350కి పైగా సినిమాల‌లో న‌టించారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రిచారు.

ఇదిలా ఉండ‌గా సినిమా రంగానికి అందించిన సేవ‌ల‌కు గుర్తింపుగా రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జరిపేందుకు నిర్ణ‌యించింది. సీపీఐ నాయ‌కుడు నారాయ‌ణ తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. 1970 నుంచి 1995 వ‌ర‌కు న‌టుడు కృష్ణ వెండి తెర‌పై ప్ర‌భావం చూపించారు.

Also Read : ఎస్పీబీని ప్రోత్స‌హించిన సూప‌ర్ స్టార్

Leave A Reply

Your Email Id will not be published!