YS Jagan Krishna : సూపర్ స్టార్ కృష్ణ రియల్ స్టార్ – జగన్
ఆయన మరణం తీరని లోటు
YS Jagan Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరన్న వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. 80 ఏళ్ల తన జీవన ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు సాధించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా వెండి తెరకు విశిష్ట సేవలు అందించారు. ఆయన మరణంతో గొప్ప నటుడినే కాదు గొప్ప వ్యక్తిని సినీ రంగం కోల్పోయిందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Krishna) స్పందించారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికే కాదు ఇరు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా ఆయన పేర్కొన్నారు. జేమ్స్ బాండ్ గా ఎల్లప్పటికీ గుర్తుండి పోతారని, ఆయన నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా కలకలం నిలిచి ఉంటుందని పేర్కొన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ నిజమైన రియల్ స్టార్ అని కొనియాడారు ఏపీ సీఎం. సహృదయం కలిగిన నటుడిగా ఎల్లప్పుడు జ్ఞాపకంగా మిగిలి పోతారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారీ ఎత్తున అభిమానులను, సంఘాలను కలిగి ఉన్నారు నట శేఖర కృష్ణ. ఆయన పూర్తి పేరు ఘట్టమ నేని శివరామ కృష్ణ.
ఆయన నిర్మాతల పాలిట దేవుడు..హీరో కూడా. పద్మాలయ స్టూడియో ద్వారా ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించారు. ఒక రకంగా తెలుగు సినిమా సినీ దిగ్గజాన్ని కోల్పోయిందని చెప్పక తప్పదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజు, కృష్ణ ఒక తరానికి చెందిన వాళ్లను కోల్పోవడం తీరని విషాదం.
Also Read : కృష్ణ మరణం వెండి తెరకు తీరని లోటు